ఏపీ యస్ ఇ సి ఏకపక్ష నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల మండిపాటు

ఏపీ యస్ ఇ సి ఏకపక్ష నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల మండిపాటు
-ఎన్నికల విధులకు హాజరుకాకపోతే కఠిన చర్యల తప్పవని రమేష్ కుమార్ హెచ్చరిక
-మీరాజకీయాలకు మాజీవితాలను ఫణంగా పెట్టమంటారా? ఉద్యోగ సంఘాలు
-వాక్సిన్ వేసుకున్న తరవాతనే ఎన్నికల విధులకు హాజరవుతామని ఉద్యోగుల సృష్టికరణ.
ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు మండి పడుతున్నాయి.మరోపక్క ఎన్నికల విధులకు ఉద్యోగులు హాజరుకాకపోతే కఠిన చర్యల తప్పవని ఎన్నికల కమిషనర్ హెచ్చరిస్తున్నారు. మీ రాజకీయాలకు ,మా జీవితాలను ఫణంగా పెట్టమంటారా?అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.కరోనా వాక్సిన్ వేసుకున్న తరువాత మాత్రమే ఎన్నికల విధులకు హాజరవుతామని అంతవరకూ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నాయి . యస్ ఇ సి నిర్ణయం పై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి . దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు .
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ,రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడుస్తున్న యుద్ధం 20 -20 మ్యాచ్ ను తలపిస్తున్నది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలకు ససేమీరా అన్నా రమేష్ కుమార్ వెనక్కు తగ్గలేదు సరికదా సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చే వరకు కూడా ఆగలేదు . సుప్రీం కోర్ట్ లో కేసు ఉంది అది వచ్చేవరకు వేచి చూడండి అన్నా ఆయన అందుకు అంగీకరించలేదు. ఆయన అనుకున్న విధంగానే ఎన్నికల షడ్యూల్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులకు హాజరుకాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ,పంచాయత్ రాజ్ ఉన్నతాధికారులు ఎంత చెప్పిన వినకుండా ఏకపక్షంగా వ్యవహరించటంపై తీవ్ర విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. ఎన్నికలు జరపటం ఎన్నికల సంఘం విధి మాత్రమేనని దాన్ని కక్ష సాధింపుగానో లేక్ రాజకీయంగానో ఉండకూడదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధాన కర్తగా ఎన్నికలను నిర్వయించే ఒక ప్రధాన పాత్ర పోషించాలి . కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరించటం పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ విషయంలో రాజకీయ పార్టీలు కూడా చీలిపోయాయి . అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇది ఎన్నికలకు సమయం కాదు .కరోనా మహమ్మారి వ్యాక్సిన్ ఉద్యోగులు తీసుకున్న తరవాత ఎన్నికలు జరపాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. యస్ ఇ సి చర్యలను ప్రతిపక్ష తెలుగుదేశం తో సహా మిగతా పార్టీలు సమర్థిస్తున్నాయి.కొంత మంది రాజకీయ పరిశీలకులు మాత్రం యస్ ఇ సి ,రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక అంగీకారంతో ఎన్నికలు నిరాయించాలేతప్ప ఏకపక్షంగా ఎన్నికల షడ్యూల్ ను ప్రకటించటం సరైంది కాదని అంటున్నాయి. సోమవారం సుప్రీంకోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు వేసిన పీటీషన్లపై విచారణ జరగనున్నది. ఈలోగానే ఆదరాబాదరాగా ఎన్నికల షడ్యూల్ ప్రకటించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయినట్లు సమాచారం . సుప్రీం కోర్ట్ తీర్పు ఎలా ఉంటుందో నేనే ఉత్కంఠత నెలకొన్నది.

 

Leave a Reply

%d bloggers like this: