తిరుపతి లో బీజేపీ పోటీ ఖాయం

తిరుపతి లో బీజేపీ పోటీ ఖాయం
-బీజేపీ పై పవన్ కళ్యాణ్ కినుక
-తిరుపతి లో బీజేపీ పోటీపై అసహనం
-పవన్ ను కలిసిన సోమువీర్రాజు -ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాదన
– పవన్ మెత్త పడ్డట్లేనా ?
తిరుపతి బరిలో బీజేపీ నిలవటం ఖాయమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కినుక వహించారు. తిరుపతి ఎన్నికల్లో తామే పోటీచేస్తామని బీజేపీ ప్రకటించడంపై అసహనంగా ఉన్నారు. ఈనేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ కలిసి తిరుపతి ఉపఎన్నికపై చర్చించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. ఆయన మాటలను బట్టి పవన్ మెత్త బడ్డట్లు తెలుస్తుంది. మెత్త బడ్డారా? లేదా అనేది పవన్ కళ్యాణ్ మాత్రమే చెప్పాలి . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఖాళీని , భర్తీ చేసేందుకు త్వరలో జరగనున్న ఎన్నికలలో ఎవరు పోటీచేయాలని దానిపై బీజేపీ , జనసేన మధ్య బేదాభిప్రాయాలు నెలకొన్నాయి. మొదట నుంచి తిరుపతిలో పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకొని తామే పోటీచేస్తున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ కు బీజేపీ వైఖరి నిరాశ కలిగించింది. తామే పోటీచేస్తాం అని బీజేపీ రాష్ట్ర నేతలు ప్రకటించడంపై జనసేనాని అసహనంగా ఉన్నారు. ఢిల్లీ లీడర్ లు బాగానే ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న లీడర్ల తోనే సమస్య వస్తుందని పవన్ అనటం ,బీజేపీ లీడర్ల తో జనసేనకు ఉన్న సంభందాలను తెలియజేస్తున్నది. అంతకు ముందు తామే తిరుపతి నుంచి పోటీచేస్తాం అని ప్రకటించటం పవన్ కళ్యాణ్ ఆశలమీద బీజేపీ నీళ్లు చల్లింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు’గురైన పవర్ స్టార్ భవిషత్ ప్రణాళికలపై దృష్టి పెట్టారు . 2019 ఎన్నికలకు ఉప్పు , నిప్పుల ఉన్న బీజేపీ, జనసేన తరువాత కలిసి పయనించేందుకు నిర్ణయించుకున్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని , కలిసి ఆందోళనలు చేయాలనీ నిర్ణయించుకున్నాయి. కొంత దూరం ప్రయాణం చేశాయి. తిరుపతి బై ఎలక్షన్ లో పోటీచేసేందుకు తెగ ఆరాట పడిన జనసేనానికి బీజేపీ అడ్డుకట్ట వేసింది . దీంతో ఆయన వెనక్కు తగ్గటంపై పార్టీలోనే సందేహాలు కలుగుతున్నాయి. కార్యకర్తలు అయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోననే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజారాజ్యం లో తాను క్రియాశీలంగా పనిచేశానని చెప్పిన పవర్ స్టార్ జనసేన పార్టీని పనిలేక , తమాషాగా , ఆషామాషీగా పెట్టలేదన్నారు. గ్రేటర్ హైద్రాబాద్ లాగా బీజేపీ పోటీ ఇవ్వగలిగితే మంచిదే కదా ? అంటూ ఎవరు పోటీచేసేది మరో నాలుగైదు రోజుల్లో తెలుస్తుందన్నారు.వైసీపీ నాయకులూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని రాష్ట్రము తమ జాగీర్ లా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈలోపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను కలిశారు.తిరుపతి ఎన్నికలపై ఆయనతో అధిష్టానం చూచనల మేరకు చర్చించారు. ఇద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరినట్లు భేటీ అనంతరం సోము వీర్రాజు విలేకర్లు తెలిపారు. ఇద్దరికీ సంభందించిన అభ్యర్థి తిరుపతి బరిలో ఉంటారని అన్నారు . తనకు బీజేపీ అధినాయకులతో మంచి సంబంధాలే ఉన్నాయని , కానీ రాష్ట్ర నాయకులతో లేవని అందువల్ల ఎవరు పోటీచేసినా కలిసి పని చేస్తామన్నారు. అందువల్ల తిరుపతి లో బీజేపీ పోటీ ఖాయమైనట్లే చెప్పవచ్చు .అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

Leave a Reply

%d bloggers like this: