Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టులపై కేసు లు ఐ జె యి ఖండన

జర్నలిస్టులపై కేసు లు ఐ జె యి ఖండన
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కిసాన్ ట్రాక్టర్ పెడెడ్ ఘటనల ఆధారంగా పలువురు జర్నలిస్టులపై కేసులు పెట్టడం దుర్మార్గమని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు కే.శ్రీనివాసరెడ్డి,సెక్రటరీ జనరల్ బల్వీందర్ జమ్మూ లు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడిగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామినికి ప్రమాదమన్నారు. ఇండియా టుడే ఎడిటర్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ తో పాటు , మృణాల్ పాండే, వినోద్ జోషి , జాఫర్ అఘా, పరేష్ నాథ్ , అనంత నాథ్ ల పై కేసు పెట్టడం పై మండిపడ్డారు. ఇది రాజ్యంగంలో పొందుపరిచిన భావప్రకటనా స్వచ్ఛపై దాడిగా అభివర్ణించారు. జరిగే సంఘటలను రిపోర్ట్ చేయటం జర్నలిస్టుల విధి అని దానిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటె ఖండించుకునే స్వేచ్ఛ సంభందిత వ్యక్తులకు , సంస్థలకు ఉంటుందని వారు పేర్కొన్నారు. కిసాన్ ర్యాలీ సందర్బంగా ఒక వ్యక్తి చనిపోతే అక్కడనుంచి వచ్చిన సమాచారం ఆధారంగా టీవీ లలో టెలికాస్ట్ చేయటం జరిగిందని వారు తెలిపారు. ప్రభుత్వం కావాలనే కుట్ర కోణంలో రాజదీప్ సర్దేశాయి తో పాటు ఐదుగురు జర్నలిస్టులు , కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పై కేసులు నమోదు చేయటంపై తీవ్రఅభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య వాదులు ఈ చర్యలను ఖండించాలన్నారు . హర్యానా రాష్ట్రంలోని నోయిడా పోలీస్ స్టేషన్ తో పాటు మధ్యప్రదేశ్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కేసులు నమోదు చేయటం దారుణమన్నారు. జర్నలిస్టులను భయపెట్టి, బెదిరించి నిజాలను దయగలరా అని వారు ప్రశ్నించారు. ఇలాంటి చర్యల ద్వారా భావప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కే చర్యలు ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని అన్నారు. జరిగే ఘటనలను రిపోర్ట్ చేయటం సాధారణంగా జరిగే విషయమేనని అది జర్నలిస్టుల విధి లో భాగమేనని అంత మాత్రాన , వారు కావాలని రెచ్చగొట్టారని, ఇందులో కుట్ర కోణం ఉందని , భావించి వివిధ రాష్ట్రాలలో కేసులు పెట్టి , జర్నలిస్టులను బెదిరించటం , భయపెట్టటం వేధింపులకు గురిచేయడం ఎలాంటి ప్రజాస్వామ్యమని వారు ప్రశ్నించారు. ఇది భారత దేశ ప్రతిష్టకు భంగకరమన్నారు. ఇప్పటికైనా వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు .

ఎడిటర్స్ గిల్డ్ ఖండన


ఎడిటర్స్ గిల్డ్ కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది . జర్నలిస్టులతో పాటు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పై కేసును నమోదు చేశారని ఎడిటర్ గిల్డ్ అధ్యక్షులు సీమ ముస్తఫా , ప్రధాన కార్యదర్శి , సంజయ్ కపూర్ లు పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వారు హితవు పలికారు. ఎలాంటి చర్యలవలన అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ట తగ్గిపోతుందని ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పులను దిద్దుకోవాలని కోరారు.

Related posts

Apple Watch 3: Release Date, Price, Features & All The Latest News

Drukpadam

నాది ఇప్పుడు ఇండియా.. బెయిలుపై బయటకొచ్చిన పాక్ మహిళ భావోద్వేగం

Drukpadam

టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు

Drukpadam

Leave a Comment