Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ పట్టభద్రుల ఓట్లు 4 .91 లక్షలు

ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ పట్టభద్రుల ఓట్లు 4 .91 లక్షలు
-నిలిచేదెవరు ? గెలిచేదెవరు ?
– 12 జిల్లాలకు విస్తరించి ఉన్న పట్టభద్రుల నియోజకవర్గం
-ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు
ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ , పట్ట భద్రుల నియోజకవర్గ ఓటర్లు 4 లక్షల 94 వేల 396 మంది . మార్చ్ లో ఎన్నిక జరగాల్సివుంది . ఈసారి పోరు రసవత్తరంగా ఉండే ఆవకాశం ఉంది. అధికార పార్టీ కు అనుకూలత ఎంత ఉందో ప్రతికూలత కూడా అంతే ఉంది. అందువల్ల నిలిచేదెవరు, గెలిచేదెవరు అనే ఆశక్తి నెలకొన్నది . ప్రస్తుతం ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అధికార టీఆర్ యస్ కు చెందిన పల్లా రాజేశ్వరరెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీకాలం మార్చ్ తో ముగుస్తుంది. అందువల్ల మార్చ్ లో ఎన్నికలు జరగ వచ్చునని సమాచారంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. . ఓటర్ల లిస్టులు తయారు చేయటం, పోలింగ్ స్టేషన్లు లాంటి ఎన్నికల ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తుంది . ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రకటించారు.

ఉమ్మడి ఖమ్మం , నల్లగొండ ,వరంగల్ మూడు జిల్లాలు కొత్తగా ఇప్పుడు 12 జిల్లాలు అయ్యాయి . గతంలో వరంగల్ జిల్లాలో ఉన్న ప్రాంతం సిద్ధిపేట జిల్లాలో చేరటంతో జిల్లాల సంఖ్య పెరిగి 12 జిల్లాల పరిధిలోకి వచ్చింది. అంటే ఒక చిన్నపాటి దేశంతో సమానంగా ఇది ఉంది. ఓటర్ల సంఖ్య 4 లక్షల 94 వేల 396 చేరటం అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తున్నాయి . అంటే రెండు శాసనసభ నియోజకవర్గాలలో ఉండే ఓటర్లు ఒక్క పట్ట భద్రుల నియోజకవర్గంలో ఉన్నారు. శాసనమండలికి పట్టభద్రులను ఎంపిక చేయాలనే రాజ్యాంగ నిర్మాతలు ఈ చట్టాన్ని రాసినప్పుడు ఇంతమంది ఉంటారని బహుశా ఉహించి ఉండరు. ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క పట్ట భద్రుల నియోజక వర్గంలో ఓటర్లను కలవాలంటే ఇబ్బంది కరంగా మారింది. ఇప్పుడు ఎన్నికల వ్యయం కూడా భారీగా పెరిగింది. డబ్బులేకపోతే ఎన్నికల్లో పోటీచేయటం కష్టం అనేఅభిప్రాయాలే ఉన్నాయి. పార్టీలు కూడా డబ్బులు ఉన్న అభ్యర్థులనే ఇందుకు ఎంపిక చేస్తున్నాయి. ఖమ్మం ,నల్లగొండ , వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఇప్పటికే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.టీఆర్ యస్ నుంచి తిరిగి పల్లా రాజేశ్వరరెడ్డి పోటీచేస్తుండగా ,కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి , టీజె యస్ చైర్మన్ కోదండరాం , ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, సిపిఐ ,సిపిఎం బలపరిచిన విజయసారధి రెడ్డి , తీన్మార్ మల్లన్న, రాణిరుద్రమ లతో పాటు మరికొందరు పేర్లు వినపడుతున్నాయి.

అభ్యర్థులు పట్టభద్రులు కలిసే పనిలో ఉన్నారు. చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న , కోదండరాం, జయసారధి రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి రాణి రుద్రమ, ప్రేమేందర్ రెడ్డిలు ప్రచారం మొదలు పెట్టారు. తీన్మార్ మల్లన్న ప్రచారం మిగతా వారికన్నా కొంత భిన్నంగా సాగుతుంది. ఆయన జిల్లాలో అన్ని మండలాలను ముఖ్యమైన గ్రామాలలో వీధి మీటింగ్ లు పెడుతున్నారు. కేసీఆర్ పైన , రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన మీటింగ్ లకు ప్రజలు బాగానే హాజరై చెప్పే మాటలు వింటున్నారు. ఇక డాక్టర్ చెరుకు సుధాకర్ జిల్లాల్లో సమావేశాలు జరుపుతూ ఓటర్లను కలుస్తున్నారు. టీఆర్ యస్ పకడ్బందీగా ఓటర్లను చేర్పించే కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు అప్పగించింది . దీంతో జిల్లాలలో ఓటర్లు భారీగా నమోదు చేసుకున్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుంది. కేటీఆర్ స్వయంగా వివిధ జిల్లాల లోని ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి పట్టభద్రులతో పాటు , ఖమ్మం ,వరంగల్ కార్పొరేషన్ లకు జరిగే ఎన్నికలలో విజయం సాధించేందుకు దిశా నిర్దేశం చేస్తున్నారు . ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకా పోటీచేయాలా లేక ఎవరికైనా మద్దతు ఇవ్వాలా అనే తర్జన భర్జనలు అనంతరం, రాములు నాయక్ ను పోటీ పెట్టాలని నిర్ణయించింది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి జిల్లాలలో పర్యటిస్తున్నారు. సిపిఐ ,సిపిఎం మద్దతుతో వామపక్షాల అభ్యర్థిగా పోటీచేస్తున్న విజయసారథి రెడ్డి ప్రచారం అన్ని జిల్లాలలో ఒక రౌండ్ పూర్తీ అయింది. రాణి రుద్రమ, కూడా ప్రచారంలో ఉన్నారు. అయితే ఉద్యమకారులు ఒకరిగా లేకపోవటం ,అన్ని పార్టీలు పోటీలో ఉండటం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా ఉండనే అభిప్రాయాలూ ఉన్నాయి. అయితే పట్టభద్రులైన ఉద్యోగులు , నిరుద్యోగులు , డాక్టర్లు , లాయర్లు , ఉపాధ్యాయులు అధికార టీఆర్ యస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. దుబ్బాక , గ్రెటర్ లో వచ్చిన ఎన్నికల ఫలితాలతో బీజేపీ మంచి జోషి మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకు అంచనా వేసేందుకు ప్రయత్నిస్తుంది . వామపక్షాలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. సిపిఐ (ఎం ఎల్ )న్యూ డెమోక్రసీ పార్టీ అండతో తెలంగాణ జన సమితి నేత కోదండరాం ప్రచారంలో ఉన్నారు. కోదండరాం కు జేఏసీ చైర్మన్ గా తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించాడని అభిప్రాయం ఉంది. అయితే డాక్టర్ చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న , రాణి రుద్రమ లాంటి వారి పోటీ ఆయనకు కొంత మైనస్ గా మారింది. వీరందరి పోటీలో ఉంటారా లేక తప్పుకొని ఒకరికి మద్దతు ఇస్తారా ? తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!!!

Related posts

హుజూరాబాద్ నుంచి ఈట‌ల భార్య పోటీ?.. ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన జ‌మున‌!

Drukpadam

సిపిఐ కొత్తగూడం గర్జన సభ గ్రాండ్ సక్సెస్ …జోష్ లో సిపిఐ…

Drukpadam

కృష్ణ జలాల విషయంలో ఇద్దరు సీఎం లు నాటకాలాడుతున్నారు:బండి సంజయ్ ఫైర్!

Drukpadam

Leave a Comment