అన్నయ్య జపం- పవన్ రహస్యం ఏమిటి ?
అన్నయ్య జపం- పవన్ రహస్యం ఏమిటి ?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఉండి అన్నయ్య చిరంజీవి జపం ఎందుకు చేస్తున్నాడు .చిరంజీవి త్వరలో జనసేనకు అనుకూలంగా ప్రచారం చేస్తారని ,ఆయన అండదండలు మనకున్నాయని ఎందుకు అంటున్నారు , కారణం ఏమిటి ? …. పార్టీకి జనాధారణ తగ్గిందా ?లేక అయన పవర్ తగ్గిందా ? అటు షూటింగులు ఇటు రాజకీయాలతో ఇబ్బంది పడుతున్నారా? ఇది జనసైనుకులతో సహా పలురీని వేధిస్తున్న ప్రశ్న . ఎందుకోగానీ అన్నయ్య చిరంజీవి పాపులారిటీ కావాలని ఆయన కోరుకుంటున్నారు. అన్నయ్య అశ్వీరవాదాలు తనకు ఉంటాయని అంటున్నారు. అంతకు మందు ఆపార్టీ ముఖ్యనేత నాదెళ్ల మనోహర్ జనసేనకు చిరంజీవి ప్రచారం చేస్తారని అన్నారు. నిర్వేదంలో ఉన్న జనసేనుకులను బూస్ట్ అప్ చేసేందుకు ప్రయత్నం చేసేందుకే అలా అన్నారా ? లేక నిజంగానే చిరంజీవి జనసేన లోకి వస్తున్నారా ? పవర్ స్టార్ ఆలోచనలు ఏమిటి ? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. సీనియర్ యాక్టర్ గా పవన్ కళ్యాణ్ కు మంచి క్రేజ్ ఉంది. ప్రజలలో మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నాడు . మొదట్లో పవన్ కళ్యాణ్ చూడటంమహద్బగ్యాంగ బాహించిన ఆయన అభిమానులకు , అనేక సార్లు ఆయన కనిపిస్తున్నారు . అందువల్ల కొంత మోజు తగ్గే అవకాశం ఉంది. ఒక సారి రెండు సార్లు ప్రజలు చూస్తారు. కానీ అన్ని సార్లు ప్రజలు ఎవరికైనా పరుగులు పెట్టరు కదా?. దానికి తోడు రాజకీయాల్లో ఆయన వేసే అడుగులు ఒకోసారి వింతగా ఉంటున్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరితో పొత్తు ఉంటుందో , ఎవరితో ఉండదో అర్థం కానీ పరిస్థితి . అందువల్ల ఇప్పటికిగాని రాజకీయాలు ఆయనకు అర్థం అయినట్లు ఉంది . అందుకే అన్నయ్య ,అన్నయ్య అంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేది ఆయన ఆశ . అందులో ఎలాంటి తప్పు లేదు. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టేది అధికారంలోకి రావాలనే అందుకు అనుగుణంగా ఎత్తులు వేయాల్సిఉంది ,వ్యూహాలు రచించాలి . పవన్ ఎదో చేయాలనే ఆలోచలో ఉన్నాడు . కానీ ఎక్కడో తప్పిదాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి.సరైన రాజకీయ ఎత్తులు వేయటంలో వైఫల్యాలు కనిపిస్తున్నాయి . తనకు తీరిక దొరికినప్పుడల్లా పట్టుదలతో రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. కానీ ఎందుకో ఆయనపై ప్రజలలో నమ్మకం కలగటంలేదు .
అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు ఆయనతో పాటు పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనము చేసినప్పుడు విభేదించారు. మదన పడ్డారు. 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించి ప్రశ్నిస్తానన్నారు . విచిత్రమేమంటే అప్పట్లో ఆయన అధికార పార్టీని వదిలి వైయస్ ఆర్ కాంగ్రెస్ ను ప్రశ్నించడమ చేశారు. బీజేపీతో ,తెలుగు దేశంతో జట్టు కట్టారు . ఆయన పార్టీ మాత్రం పోటీచేయలేదు . రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావటానికి పవన్ ప్రచారం కూడా ఉపయోగపడిందనే అభిప్రాయాలూ ఉన్నాయి . 2019 ఎన్నికలలో వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీచేశారు . అధికారంలోకి వస్తామన్నారు. కానీ తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాలలో ఓటమి చెంది పరువు పోగొట్టుకున్నారు . ఎన్నికల్లో జనసేన ఒక సీటుమాత్రమే గెలిసింది . ఎన్నికలకు ముందు బీజేపీ విధానాలను తూర్పార బట్టారు. ప్రత్యేకహోదా అడిగితె పుచ్చిపోయిన లడ్డులు ఇచ్చారని బీజేపీని వేద్దేవా చేశారు . దక్షణాదికి అన్యాయం అన్నారు. ఉత్తరాది పెత్తనం ఏమిటి అన్నారు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు చేగువేరా ఆదర్శమన్నారు. ఎన్నికల తరువాత బీజేపీ తో చెట్టపట్టాలకు సిద్ధమన్నారు. చివరకు బీజేపీ తో సమయం సందర్భం లేకుండా పొత్తు అన్నారు . ఢిల్లీకి వెళ్లారు బీజేపీ పెద్దలను కలిశారు. మీతో కలిసి నడుస్తామన్నాడు. ప్రత్యేక హోదా ఏమైందో తెలియదు. దాన్ని గురించి ఏమి మాట్లాడారో చెప్పలేదు . ఇక్కడ కలిసి పోయినట్లు చెప్పారు . హైద్రాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ అన్నారు. బీజేపీ అడిగిందని పోటీనుంచి తప్పుకున్నారు. తిరుపతి లోకసభకు జరిగే ఉపఎన్నికలలో పోటీచేస్తామన్నారు . నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు . బీజేపీ వత్తిడితో మెత్తబడ్డారు. బీజేపీకి ఆవకాశం ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలతో జనసేన క్యాడర్ లో కొంత నిరుత్సవం ఆవరించింది .క్యాడర్ జారిపోతుందనే ప్రచారం జరుగుతుంది. దీనితో కొత్త ఎత్తుగడలకు సిద్ధమైయ్యారు. అందుకే చిరంజీవి ని రాజకీయాల్లోకి లాగుతున్నారనే ప్రచారం జరుగుతుంది . ఆయన నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వక పోవటం గమనార్హం ….