Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ యస్ ఈ సి నిమ్మగడ్డకు స్పీకర్ ఊహించని షాక్

ఏపీ యస్ ఈ సి నిమ్మగడ్డకు స్పీకర్ ఊహించని షాక్
-మంత్రుల ఫిర్యాదుల పై స్పీకర్ చర్యలు
-విషయాన్నీ ప్రివిలేజ్ కమిటీకి సిపార్సు
-ఎలాంటి చర్యలు తీసుకునే ఆవకాశం ఉంటుందనే ఆశక్తి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఊహించని షాక్ ఇచ్చారు . మంత్రుల ఫిర్యాదు మేరకు స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేశారు. స్పీకర్ కు మంత్రులు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు చేపట్టారు. కొరకారని కొయ్యగా మరీన నిమ్మగడ్డ వ్యవహారం మొదట్లో కొంత న్యాయంగానే ఉందని భావించినవారికి సైతం , ఆయన చర్యలు పక్షపాతంగాను , ఎవరికో మేలు చేయాలనే దురుద్దేశంతో కూడుకుని ఉన్నాయనే వైయస్సార్ సీపీ మాటలను నిజం చేసేలా ఉన్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈసంఘటన ఏపీలో పెద్ద చర్చ నీయంశంగా మారింది . ఎన్నికల కమిషన్ కు ,రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న అగాధం మరింత పెరిగింది . నిమ్మగడ్డ ఎక్కడ తగ్గటంలేదు . పైగా ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకోవటం , వార్నింగ్ లు ఇవ్వడం లాంటి చర్యలకు పాల్పడటంతో, అధికారులు సైతం హడలెత్తుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే తనకున్న అధికారాలకన్నా ఆయన ఎక్కువగా ఊహించుకోవటం వల్లనే సమస్యలు వస్తున్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. మంత్రులపై గవర్నర్ కు ఫిర్యాదు పరాకాష్టకు చేరుకున్నది . దీంతో మంత్రులు తమకున్న మార్గంగా స్పీకర్ ను ఆశ్రయించారు. సినీయర్ మంత్రులు బొత్స సత్యనారాయణ , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి లపై గవర్నర్ బిస్వా భూషణ్ హరిచందన్ కు చేసిన ఫిర్యాదు లో తమ హక్కులకు భంగం , తమ గౌరవాన్ని మంటగలిపే విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారని వారు స్పీకర్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీయర్ మంత్రులు అయినందున వారి ఫిర్యాదును వెంటనే స్పీకర్ పరిశీలించారు. తనకున్న అధికారాలమేరకు స్పీకర్ మంత్రుల హక్కులకు సంభందించిన అంశం అయినందున ప్రివిలేజ్ కమిటీ ముందుకు సమస్య వెళ్లటంతో దీనిపై ఎలాంటి చర్యలు ఉంటాయి . అసలు యస్ ఈ సి పై చర్యలు తీసుకునే అధికారం శాశనసభ స్పీకర్ కు ఉంటుందా ? లేదా ? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై మొదట ప్రివిలేజ్ కమిటీ ముందు యస్ ఈ సి హాజరు కావాల్సి ఉంటుంది. ప్రివిలేజ్ కమిటీలో మెజార్టీ వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులే ఉన్నారు. అందువల్ల చర్యల విషయం ఎలా ఉన్న ముందు యస్ ఈ సి వారి ముందుకు హాజరయ్యే ఆవకాశం ఉందా అనే దానిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఏపీలో జరుగుతున్నా పరిణామాలు దేశ రాజకీయాలలో ఆశక్తి గా మారాయి . రాష్ట్ర ఎన్నికల అధికారికి ఉన్న అధికారాలు మరోసారి చర్చకు దారితీశాయి.

Related posts

టీఎంసీ ఎంపీ భుజం తట్టిన రాజ్‌నాథ్ సింగ్..

Drukpadam

ధరల పెరుగుదలపై పార్లమెంట్లో చర్చకు పట్టు …నిన్న నేడు 23 మంది ఎంపీల సస్పెన్షన్ !

Drukpadam

దటీస్ చింతమనేని ….కోడిపందేలు నా వ్యసనం అంటూ కుండబద్దలు కొట్టిన ప్రభాకర్!

Drukpadam

Leave a Comment