మాట…మర్మం

మాట;- టీడీపీ పంచాయతీ ఎన్నికల మానిఫెస్టో ను రద్దు చేసిన -యస్ ఈ సి
మర్మం ;- జరగాల్సిన ప్రచారం జరిగిపోయినాక చర్యలంటే ఇలానే ఉంటాయి

 

మాట :- ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి -సోము వీర్రాజు
మర్మం :- వచ్చిననాడు చెప్పండి … హోదా ను పక్కదారి పట్టించేందుకే అంటున్నారు.

 

మాట ;- జీవిత చరమాంకంలో ఉన్న రైతుల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించండి – మాజీ ప్రధాని దేవెగౌడ
మర్మం :- ఉద్యమాలకే కరగలేదు మీమాటలకు కరుగుతారా?

మాట;-ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రము తెలంగాణనే -మంత్రి పువ్వాడ
మర్మం :- మరి ఉద్యోగుల జీతాలు పెంచమంటే ఆదాయం లేదంటున్నారెందుకు ?

 

మాట :- ఫిట్ మెంట్ ఎంత ఇద్దాం -అధికారులతో ముఖ్యమంత్రి
మర్మం ;- ఇప్పటికైనా కొలిక్కి వస్తుందా ?లేదా ?

Leave a Reply

%d bloggers like this: