Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

యువరాజు పట్టాభిషేకమా? -పార్టీలో పరిణామాలా ?

యువరాజు పట్టాభి షేకమా? -పార్టీలో పరిణామాలా ?
7 వ తేదీ టీఆర్ యస్ కార్యవర్గం అత్యవసర భేటీ పై సర్వత్రా ఉత్కంఠ
ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశాన్ని ఈ నెల 7 వ తేదీన ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు మంత్రులు , ఎంపీలు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , జడ్పీ చైర్మన్లు , డీసీసీబీ చైర్మన్ల ను ఆహ్వానించారు. అత్యంత ముఖ్యమైన విషయం లేనిదే కేసీఆర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయరు . అందువల్ల ఈ సమావేశం సమాచారం బయటకు రాగానే ఇంట బయట విస్తృత చర్చ జరుగుతుంది. ఇటీవల పార్టీలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తప్పుకొని ఆస్థానంలో తన కుమారుడైన కేటీఆర్ ను కూర్చో బెట్టబోతున్నారని వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనిపై కేసీఆర్ గానీ పార్టీగాని స్పందించలేదు. పైగా కాబినెట్ మంత్రులు , డిప్యూటీ స్పీకర్ తో సహా అనేక మంది ఎమ్మెల్యేలు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ పల్లవి అందుకున్నారు. చాలామంది తాము ఎక్కడ వెనక పడిపోతామో అనే రీతిలో కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు . అందువల్ల పార్టీ నిజంగా నిర్ణయిస్తే ఆనిర్ణయాన్ని పార్టీ విస్తృత సమావేశంలో కేసీఆరే స్వయంగా చెప్పే ఆవకాశం ఉందని పరిశీలకుల అభిప్రాయం . ఇప్పటికే ప్రజలలో లోకి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని జరుగుతున్న ప్రచారాన్ని బలపరచటమో లేదా ఖండిచటమో చెయాలి ఇప్పటి వరకు అదిజరగలేదు. రేపటి సమావేశంలో స్పష్టత వచ్చే ఆవకాశం ఉంది.ముఖ్యమంత్రి గా కేటీఆర్ పేరును పార్టీలో జరిగిన నిర్ణయంగా ముద్ర వేయించుకునే అవకాశం ఉంది. దీంతో పార్టీ నిర్ణయమే శీరోదార్యం అని అందుకు అందరం బద్దులం అయిఉండాలని, ఒక తీర్మానం కూడా చేసే ఆవకాశం ఉంది. దింతో పాటు పార్టీ వ్యవస్థాగత మార్పులపై కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిపై కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఈ సమావేశంలో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే  హరీష్ రావు సేవలు ఏవిధంగా ఉపయోగించుకుంటారు. ఆయన్ను పార్టీకి పరిమితం చేస్తారా? లేక కేటీఆర్ టీం లో చేర్చుతారా? లేదా అనే సందేహాలు ఉన్నాయి. కేసీఆర్ కూతురు కవిత ను కూడా పార్టీలో ముఖ్య బాధ్యలలో నియమిస్తారా? లేదా అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది.ఆమెకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని ఎప్పటినుంచో ఊహాగానాలు ఉన్నాయి. పార్టీ ప్లినరీ సమావేశం పై కూడా నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అంటే కాకుండా కొన్ని జిల్లాలో పార్టీ నాయకుల మధ్య నెలకొన్న సమన్యయ లోపం పై కేసీఆర్ హెచ్చరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో నాయకుల మధ్య వాతావరణం సరిగాలేదని వాటిని చక్కదిద్దకపోతే పార్టీకు నష్టమని ఇంటలిజెన్స్ నివేదికలు ఇచ్చాయి. నాయకులను మందలిస్తారని అనుకుంటున్నాను. అయితే సమావేశంలో మందలిస్తారా? ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తారా ? అనేది చూడాల్సిఉంది. మరో ప్రధాన మైన అంశం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వ్యవహారం . ఇది కేటీఆర్ ను ముఖ్యమంత్రి ని చేయటంకన్నా అత్యంత ప్రధానమైనదిగా ఉంది. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో , నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం అయినా కేసీఆర్ ఎట్టి పరిస్థితిలో సాగర్ లో గెలిచి తీరాలని నాయకులకు ఆదేశాలు జారీచేశారు. అక్కడ పర్యటనకు కూడా సిద్ధమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపలనే ఒకసారి పర్యటన చేసి నియోజకవర్గానికి కావాల్సిన వాగ్దానాలు చేసి ఓట్లు రాబట్టాలని ప్లాన్ తో ఉన్నారు. దుబ్బాక , గ్రేటర్ ఎన్నికల తరవాత వాటినుంచి పాటలు తీసుకున్న టీఆర్ యస్ సాగర్ ఎన్నికను ఆషామాషీగా తీసుకోరాదని నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీంతో టీఆర్ యస్ కార్యవర్గం అత్యవసర భేటీ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది .

Related posts

భవానీపూర్ లో మమతా బెనర్జీనే ఘనవిజయం …మైజార్టి 58 వేలకు పైగా!

Drukpadam

బెంగాల్ లో టీఎంసీ పై మంత్రి శ్రీకాంత్ మహతా అనుచిత వ్యాఖ్యలు…

Drukpadam

సంక్షేమం , స్వయంసమృద్ధి, సమానత్వం మా ఎజెండా: వైయస్ షర్మిల…

Drukpadam

Leave a Comment