ప్రధాని కంట కన్నీరు

ప్రధాని కంట కన్నీరు
ప్రధాని మోడీ వ్యూహం లో భాగంగానో లేక నిజంగానే పెట్టారో తెలియదు కానీ రాజ్యసభలో కన్నీరు పెట్టడంతో షాక్ తీనడం సభ్యుల వంతైంది . ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ ఈనెల 15 వ తేదీన రిటైర్ అవుతున్నారు. ప్రధాని ప్రసంగ సందర్భంలో ఆయన గురించి ఆయన మంచి తనం గురించి ఆకాశానికి ఎత్తారు. ఆయననుంచి నేర్చుకోవాల్సింది చాల ఉందని , ఏ రోజు ఆయన అవసరానికి మించి మాట్లాడిన సందర్భం లేదని పొగిడారు. ఇలాంటి వ్యక్తి రిటైర్ కావడం బాధగా ఉందని కన్నీరు పెట్టారు.దీనితో సభ్యులంతా షాక్ తిన్నారు. గత కొంత కాలంగా గులాంనబీ ఆజాద్ పార్టీ పై తిరుగుబాటు చేస్తున్నారు. పార్టీ ప్రక్షాళన చేయాలనీ లేఖ రాసిన 23 మందిలో ఆయన ఒకరు . దీనితో ఆ విషయాన్నీ కూడా ప్రధాని వదలలేదు. గులాం నబీ సూచనలు పాటిస్తే కాంగ్రెస్ బాగుపడుతుందన్నట్లు కూడా ప్రధాని సెలవిచ్చారు. దీనితో ప్రధాని మాటలు కన్నీళ్లు చర్చనీయాంశం అయ్యాయి.

Leave a Reply

%d bloggers like this: