Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీ జూలు విదిల్చిందా…?

కాంగ్రెస్ పార్టీ జూలు విదిల్చిందా…?
-భట్టి ,రేవంత్ ల యాత్రలు కాంగ్రెస్ కు ప్రాణం పోస్తాయా ?
-మాణిక్యం ఠాకూర్ మంత్రం పనిచేస్తుందా ?
కాంగ్రెస్ పార్టీ జూలు విదిల్చిందా ? భట్టి , రేవంత్ ల యాత్రలు కాంగ్రెస్ కు ప్రాణం పోస్తాయా ? మాణిక్యం ఠాకూర్ మంత్రం పనిచేస్తుందా? అనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా ఉంది. అందుకే పార్టీ రైతు యాత్రలు చేపట్టింది. ఖమ్మంలో జరిపిన విస్తృత కార్యకర్తల సమావేశం ఇచ్చిన స్ఫూర్తితో జూలు విదిల్చిన నేతలు జనం బాటపట్టారు .పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి పెరిగిందో ప్రజల వెంట నడవక పొతే జనం మర్చి పోతారని అనుకున్నారో, మాణిక్యం ఠాకూర్ మహిమ ఏమైనా ఉందో , లేక తమ పదవులకు ఎసరు వస్తుందని అనుకున్నారో తెలియదు గాని కాంగ్రెస్ లో కదలిక వచ్చింది. అందువల్ల నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.తాము వెనక బడితే బీజేపీ దూసుకుపోతోందని నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారు. అందుకే నాయకులు తమ బుర్రలకు పని చెప్పారు.దూకుడు పెంచారు. మాటల దాడికి సైఅంటున్నారు .బస్తీమే సవాల్ అంటున్నారు. తమకు వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఖమ్మం లో పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ , టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , ఇంచార్జిలు బోసురాజు, శ్రీనివాసన్ , వర్కింగ్ ప్రెసిడెంట్, పొన్నం ప్రభాకర్, మాజీఎంపీ రేణుక చౌదరి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకలాపాలను పెంచాలని నిర్ణయించుకున్నారు. సాగర్ ఉపఎన్నిక, పట్టభద్రుల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోరాదని నిర్ణయించుకున్నారు. ఖమ్మం ను రోల్ మోడల్ గా తీసుకొని పనిచేయాలని మాణిక్యం ఠాకూర్ అన్నారు. దీంతో అధికార టీఆరెఎస్ పై ఖమ్మం నుంచే శంఖారావం పూరించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదని ధ్వజం ఎత్తారు . కేసీఆర్ బీజేపీతో వ్యవహరిస్తున్న తీరు ఢిల్లీలో ఒక రకంగా , రాష్ట్రంలో మరో రకంగా ఉంటుందని అన్నారు. బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకొని బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించకపోయిన మాట్లాడలేని దద్దమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధ్వజం ఎత్తారు. రైతుల కు అన్యాయం చేసే నల్ల చట్టాలను తొలుత వ్యతిరేకించి వారు ఇచ్చిన బంద్ కు సైతం మద్దతు ఇచ్చి మంత్రులతో పాటు బంద్ చేయించిన కేసీఆర్ ,ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన తరువాత ఆ చట్టాల ఊసెత్తక పోవటాన్ని తప్పు పట్టారు. ఆయన యూటర్న్ విధానాలను తూర్పార బట్టారు . సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి రైతు భరోసా యాత్ర చేపట్టగా , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ నుంచి హైదరాబాద్ వరకు రైతు యాత్ర చేపట్టారు. జగ్గారెడ్డి సైతం యాత్రలకు సిద్ధం అయ్యారు. భట్టి ఇటీవల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రత్యేకించి టీఆరెఎస్ పార్టీపైనా కేసీఆర్ పైన విమర్శల జడివాన కురిపిస్తున్నారు. రైతు భరోసా యాత్రలో కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలపై రైతులకు వివరిస్తున్న తీరు ఆకట్టుకుంటున్నది. సీఎం పదవి తన చెప్పుతో సమానమని కేసీఆర్ అనడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.కాంగ్రెస్ లో మొదలైన ఈ చురుకు కంటిన్యూ చేస్తారా ? మధ్యలో కాడి కింద పడేస్తారా అనేది చూడాలి…???

Related posts

ఖమ్మం టీఆర్ యస్ లో సమన్వయం కోసం నామ చేస్తున్న కృషి ఫలిస్తుందా?

Drukpadam

సీఎం గారూ… రేపటి మీ ఢిల్లీ యాత్ర దేనికి స్వామి :వర్ల

Drukpadam

పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ హింస.. నిలిచిపోయిన రైలు సర్వీసులు!

Drukpadam

Leave a Comment