మాజీ ఎంపీ పొంగులేటి చుట్టూ రాజకీయం?

మాజీ ఎంపీ పొంగులేటి చుట్టూ రాజకీయం
-షర్మిల నుంచి ఫోన్ కాల్ -సమాధానం ఇవ్వని పొంగులేటి
-పార్టీ మారతాడు అంటూ  వార్తలు
-ఫేక్ వార్తలు అంటూ కొట్టిపారేస్తున్న పొంగులేటి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో సారి వార్తలలోకి ఎక్కారు . అయన చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వైయస్ షర్మిల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అందుకు ఆయన సంధానం ఇవ్వలేదని అంటున్నారు. పార్టీ మారతాడనే వార్తలపై అవి ఫేక్ వార్తలని ఆయన కొట్టి పారేస్తున్నారు.
రాజకీయాలలో ప్రవేశించిన కొద్దికాలానికే ఆయన ఎంపీ అయ్యారు. ఆయన డైనమిజం , చొరవ, కలుపుగోలుతనం , మాటతీరు, తెగువ,స్పందన , ఆయన్ను ప్రజలకు చేరువ అయ్యేలా చేశాయి. 2014 ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ తరుపున ఖమ్మం ఎంపీగా అనూహ్య విజయం సాధించారు. తరువాత కాలంలో ఆయన తెలంగాణ రాజకీయాలలో వైకాపా లేనందున అధికార టీఆర్ యస్ లో చేరారు. 2019 తిరిగి ఖమ్మం లోకసభ టికెట్ ఆశించారు . కానీ ఎందుకో కేసీఆర్ ఆయనకు టికెట్ నిరాకరించారు. ఏమిటని అడిగితె రాజకీయ సమీకరణాలు , సామజిక సమీకరణాలన్నారు. అప్పట్లోనే ఆయన్ను కాంగ్రెస్, బీజేపీలు పార్టీలోకి వచ్చి ఖమ్మం నుంచి పార్లమెంటుకు పోటీచేయమని రాయబారాలు నడిపాయి. ఆయనకు టికెట్ రాకపోవడంపై ఆయన అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తం అయింది . అయినప్పటికీ ఆయన సహనంతో అందరికి నచ్చచెప్పారు. పార్టీ నిర్ణయించిన నామ నాగేశ్వరరావు కు మద్దతు ప్రకటించారు. ఆయనకు లోకసభ ఇవ్వలేక పోతున్నందుకు విచారం వ్యక్తం చేసిన  పార్టీ  పెద్దలు రాజ్యసభ సీట్ ఇస్తామని ప్రామిస్ చేశారు. అదికూడా ఇవ్వలేదు. ఆయనకు రాజ్యసభ ఇస్తున్నారని మీడియా కోడై కూసింది . కానీ ఆయన్ను పక్కన బెట్టి కే ఆర్ సురేష్ రెడ్డి కి టికెట్ కేటాయించారు. అయినప్పటికీ ఆయన టీఆర్ యస్ పార్టీ తోనే తన ప్రయాణమన్నారు. ఆయన పార్టీ మరుతున్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలకాలంలో బీజేపీ కీలకమైన నేతలకు గాలంవేస్తుంది .అందులో భాగంగా పొంగులేటికి కూడా గాలం వేసినట్లు వార్తలు వచ్చాయి. కొంత మంది బీజేపీ అగ్రనేతలు ఆయనతో సమావేశం అయినట్లు ప్రచారం జరిగింది. ఆయనకు రాజ్యసభతో పాటు కేంద్ర మంత్రిపదవి కూడా ఆఫర్ చేసినట్లు గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతానానికి ఎన్నికలు లేవు. ఆయనపై మాత్రం నిరంతరం ప్రచారం జరుగుతూనే ఉంది. కొత్తగా తెలంగాణాలో వైయస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. అందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. వైయస్ అభిమానులను ,గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నవారిని చేరదీసి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలనే ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె 2014లో వైకాపా నుంచి ఎంపీ అయిన పొంగులేటికీ ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె ఫోన్ కాల్ కు ఆయన స్పందించలేదని కూడా వార్తలు వచ్చాయి. టీఆర్ యస్ లో తాను ఉన్నానని పార్టీ తనకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చుతున్నారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితులతో ఒకరుగా ఆయన ఉన్నారు. కేటీఆర్ సీఎం అయితే మంచి పొజిషన్ వస్తుందని ఆయన బాహించారు. కానీ ఇప్పట్లో కేటీఆర్ సీఎం అయ్యే అవకాశాలు లేవని టీఆర్ యస్ విస్తృత సమావేశంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దీనితో కేటీఆర్ సన్నిహితులు కొంత నిరుత్సహానికి గురైయ్యారు. అయనప్పటికీ సీఎం మార్పు ఉంటె తానే స్వయంగా అందరిని పిలిచి చెబుతానని అనటం కొంత ఊరట నిచ్చే అంశంగా చూస్తున్నారు. శ్రీనివాసరెడ్డి తాను కేటీఆర్ ను నమ్ముకున్నానని ఆయన వంద శాతం న్యాయం చేస్తాడని నమ్ముతున్నారు. ఆయనకు ఏమి న్యాయం జరుగుతుంది? కేటీఆర్ ఏమి న్యాయం చేస్తాడు ?ఏప్పుడు చేస్తాడు ? అనేది చూడాల్సిందే ???

Leave a Reply

%d bloggers like this: