Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎంపీ శశి థరూర్ రాజదీప్ సర్దేశాయి అరెస్ట్ పై సుప్రీం స్టే

ఎంపీ శశి థరూర్ రాజదీప్ సర్దేశాయి అరెస్ట్ పై సుప్రీం స్టే
రిపబ్లిక్ డే రోజు రైతులు జరిపిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా అల్లర్లకు కారణమంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ , సీనియర్ ఎడిటర్ రాజదీప్ సర్దేశాయి మరో ఐదుగురు జరన్లిస్టుల అరెస్ట్ ను మరో రెండు వారలు నిలిపి వేయాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది . రైతుల ర్యాలీ సందర్భంగా రైతులను రెచ్చగొట్టేవిధంగా వ్యవహరించారని వారిపై జనవరి 30 వ తేదీన పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసేందుకు నోటీసులు జారీచేశారు. దీనిపై వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ యస్ .ఏ బొబ్దే ఆధ్వరంలో ఉన్న బెంచ్ విచారించి అరెస్ట్ చేయకపోతే ప్రమాదం ఏమి ముంచుకు రాదని అంటూ దీనిపై కేంద్ర ప్రభుత్వానికి , పోలీసులుకు నోటీసులు జారీచేసింది. రెండు వరాల తరువాత విచారిస్తామని సుప్రీం తెలిపింది . అంతవరకూ వారిపై ఎలాంటి చెర్యలు తీసుకోరాదని పేర్కొన్నది . కేసులో శశిథరూర్ , రాజదీప్ సర్దేశాయి . తో పాటు మృణాల్ పాండే , జాఫర్ అఘా, పరేష్ నాథ్ , వినోద్ కే .జోషి, అనంత్ నాథ్ లనే జర్నలిస్ట్ లు ఉన్నారు.

Related posts

7 Easy Hairstyles to Complete Your Fall Outfits

Drukpadam

ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్ట్ సంఘాల నేతలు!

Drukpadam

2020 ప్రపంచాన్ని వణికించిన కరోనా

Drukpadam

Leave a Comment