Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్షాల పయనమెటు ?

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్షాల పయనమెటు ?
-కాంగ్రెస్ తో జతకడతాయా ?టీఆర్ యస్ తో దోస్తీనా ?
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో త్వరలో జరగనున్నాయి. అన్ని సక్రమంగా ఉంటె మార్చ్ 15 న కొత్త పాలకవర్గం కొలువు తీరాల్సిఉంది . అయితే ఈ సారి ఎన్నికల్లో టీఆర్ యస్ జెండా ఎగరేస్తుందా ? లేదా? కాంగ్రెస్ పుంజు కుంటుందా ? సామాజిక వర్గాల పొందికలు ఎలాఉంటాయి. వామపక్షాల పయనమెటు ? స్వతంత్రంగా పోటీచేస్తాయా? లేక ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాయా ? అనే చర్చ జరుగుతుంది. ఒకప్పుడు ఖమ్మం లో బలమైన శక్తిగా ఉన్న సిపిఎం బలహీన పడింది. సిపిఐ కి బలం అంతంత మాత్రమే . రూరల్ ప్రాంతంలో కొంత పట్టు ఉంది . అందువల్ల ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా ? చేస్తే ఎవరితో పొత్తు పెట్టుకొంటాయి. కాంగ్రెస్ తోనా ? లేక అధికార టీఆర్ యస్ తోనా ? అనే చర్చ జరుగుతుంది. టీఆర్ యస్ వామపక్షాలతో కలిసి పోటీచేయాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అధికారంలో ఉన్న పార్టీ తో పొత్తు లెఫ్ట్ పార్టీలకు కొంత ఇబ్బంది కరంగానే ఉంటుంది. అది జరిగే పనేనా ? అంటే అనుమానమే ? ఇక కాంగ్రెస్ పార్టీ తో పొత్తు ఉంటుందా? అంటే ఆవకాశం ఉందనే అభిప్రాయాలూ ఉన్నాయి. కాంగ్రెస్ కూడా లెఫ్ట్ తో పొత్తుకు రెడీ అంటుంది. పొత్తుతో సరిపోదు నిజాయతీగా ఒకరి ఓట్లు మరొకరికి బదిలీ అయ్యేట్లు పార్టీలు చూసుకోవాల్సిఉంది. అదిజరగకపోతే పొత్తుకు అర్థం లేదనే అభిప్రాయాలూ ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకున్న లెఫ్ట్ పార్టీలకు కొంత అనుభవం ఉంది. గత ఎన్నికల్లో వైరా నియోజకవర్గం సిపిఐ కి సీటు కేటాయించిన కాంగ్రెస్, సిపిఐ అభ్యర్థి కి ఓట్లను బదిలీ చేయించటంలో విఫలమైందనే అభియోగాలు ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ తో పొత్తు విషయంలో కొంత ఆలోచనలో ఉన్నాయి. అయితే ఎన్నికల నాటికీ పొత్తుల విషయం ఏమౌతుంది . ఏపార్టీ ఎవరితో పొత్తు పెట్టుకొంటుంది అనేది తేలుతుంది . ఇప్పటికే కొన్ని పార్టీల మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగాల్సి ఉంది. మార్చ్ 14 తో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పాలకవర్గం పదవి కాలం ముగుస్తుంది. లెక్కప్రకారం ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సిఉంది. డివిజన్ల పునర్విభజన జరగాలి, అవి అయినా తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది . ఇప్పటి వరకు ఆపని జరగలేదు. అందువల్ల పాలకవర్గం కాలం ముగిసే నాటికీ ఎన్నికలు జరిగే ఆవకాశాలు లేవు. పైగా పట్ట భద్రుల ఎన్నికలు మార్చ్ 14 న జరగ నున్నాయి. అందువల్ల వాటిని నిర్ణిత కాలంలో జరిపే ఆవకాశం లేదు. ఫలితంగా స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి కార్పొరేషన్ పోనున్నదనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఖమ్మం తో పాటు వరంగల్ , కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాలి . ఈ రెండు కార్పొరేషన్లలో టీఆర్ యస్ విజయం సాధించాలి . లేకపోతె టీఆర్ యస్ పని అయిపోయిదనే ప్రచారం ఊపందుకుంటుంది. అందువల్ల పట్టభద్రుల ఎన్నిలకలు ,నాగార్జున సాగర్ ఎన్నికలు ముగిసిన తరువాత కార్పొరేషన్ల పై ద్రుష్టి సారించాలనేది టీఆర్ యస్ అభిప్రాయం . అందుకు అనుగుణంగా పావులు కదుపుతుంది . అంటే కార్పొరేషన్లకు ఎన్నికలు ఏప్రిల్ లేదా మే లో జరిగే ఆవకాశం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో , ఏపార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో చూడాలి మరి !!!

Related posts

మునుగోడు ఉప ఎన్నికకు స్టీరింగ్ కమిటీని ప్రకటించిన బీజేపీ!

Drukpadam

పవన్ సినిమాను తొక్కేయాల్సిన అవసరం మాకు లేదు..పేర్ని నాని!

Drukpadam

వి హెచ్ కాంగ్రెస్ ను వీడను న్నారా ?

Drukpadam

Leave a Comment