Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డి మాస్ లీడర్- కొండా సురేఖ

రేవంత్ రెడ్డి మాస్ లీడర్-అడ్డుకోకండి
-కాంగ్రెస్ సీనియర్లపై ధ్వజం
-ప్రతి ఒక్కరూ రేవంత్ కు మద్దతివ్వాలి
-రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభలో కొండా సురేఖ
రేవంత్ రెడ్డి మాస్ లీడర్ ఆయనకు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొని రావాలని మాజీమంత్రి,ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొండా సురేఖ అన్నారు. ఆయన పర్యటనలను అడ్డుకోవాలని చూడటం మంచిపద్దతి కాదని ఆమె కాంగ్రెస్ సీనియర్లపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచించాలని కోరారు. నగర్ కర్నూల్ లో ఒక రోజు రైతు దీక్షకు వెళ్లిన రేవంత్ రెడ్డి నాయకుల కోరిక మేరకు దీక్షను కాస్త పాదయాత్రగా మార్చారు. దీనిపై పార్టీలోనే విమ్మర్శలు ఉన్నాయి. అందువల్లనే ఆయన సభకు గాని, యాత్రలోగాని , ముఖ్యనాయకులు హాజరుకాలేదని తెలుస్తుంది.ఆయన పార్టీ అనుమతి లేకుండానే దీక్షకు వెళ్లి వ్యూహాత్మకంగా పాదయాత్ర చేపట్టారని అందువల్లనే టీపీసీసీ అధ్యక్షుడితో సహా రేవంత్ రెడ్డి కార్యక్రమానికి పెద్దనాయకులు ఎవరు హాజరు కాలేదని తెలుస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ , మాజీ ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్యే సీతక్క , చిన్నారెడ్డి , వంశీచంద్ రెడ్డి,లాంటి కొందరు నాయకులూ మాత్రమే హాజరు కావటం కొండా సురేఖ మాటలు కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలను మరోసారి భట్ట బయలు చేశాయి.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర ముగింపు నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ లో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లపై ఆమె ధ్వజమెత్తారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అడ్డుతగిలినవాళ్లే ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. గతంలో రైతు సమస్యలపై వైఎస్సార్ పాదయాత్రకు కూడా అనుమతి లేదన్నారని, ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చూశారని అన్నారు. ఆ పెద్దమనుషులే ఈరోజు కూడా మాట్లాడుతున్నారని కొండా సురేఖ విమర్శించారు. నాడు వైఎస్ ను ఆపాలని వారు భావించినప్పుడు వైఎస్ భయపడలేదని, కాంగ్రెస్ కోసం నడిచారని, టీడీపీని గద్దె దించి రైతాంగాన్ని ఆదుకున్నారని వెల్లడించారు. ఇప్పుడు రైతుల కోసం పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డికి మనుషులు అనే ప్రతి ఒక్కరూ మద్దతు పలకాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉత్తమ్ కుమార్ క్లాస్ లీడర్ అయితే, రేవంత్ రెడ్డి మాస్ లీడర్ అని కొండా సురేఖ అభివర్ణించారు. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వంటి మాస్ లీడరే సరైనవాడు అని అభిప్రాయపడ్డారు.అందువల్ల కాంగ్రెస్ తిరిగి అధికారం లోకి రావాలంటే రేవంత్ లాంటి దమ్మున్న లీడర్ పార్టీకి అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పార్టీని గతంలో నడపటం తేలికైన విషయమని ఇప్పుడు చాలాకష్టం అంటూనే నాయకత్వం సరిగా లేకపోతె అందరికి నష్టం జరుగుతుందన్నారు.

Related posts

ఈట‌ల రాజేంద‌ర్ కోస‌మే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది: కేటీఆర్!

Drukpadam

కమిషన్ల తెలంగాణ… అవినీతిలో కర్ణాటకకు మించిపోయింది ..ఠాక్రే

Drukpadam

కేటీఆర్… ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడంలేదా?: రేవంత్ రెడ్డి…

Drukpadam

Leave a Comment