విశాఖ లో అడుగు పెట్టనివ్వం -ఏపీ సీఎం జగన్
విశాఖ లో అడుగు పెట్టనివ్వం -ఏపీ సీఎం జగన్
-పోస్కో ప్రతినిధులను కలిసింది నిజమే
-కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమన్నాం
విశాఖలో ప్రవేట్ వారిని అడుగు పెట్టనివ్వమని ఏపీ సీఎం జగన్ కార్మిక సంఘాల నేతలకు హామీ నిచ్చారు. విశాఖ పర్యటనకు వచ్చిన జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అయితే తాను పోస్కో ప్రతినిధులను కలిసిన మాట నిజమే నని జగన్ అన్నారు. వారిని కలిసిన సందర్భంగా కడపలో స్టిల్ ప్లాంట్ పెట్టమని అడిగానని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వారితో ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. ఇక్కడ ప్రజల ఇష్టప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. ఇప్పటికే వైసీపీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్నా ఆందోళనలో పాల్గొంటున్నది. అంతే కాకుండా ఆపార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పాదయాత్రకు కూడా సిద్ధం అయ్యారు. జగన్ విశాఖ పర్యటనలో ఎలాంటి హామీ ఇస్తారో ననే ఆశక్తి నెలకొన్నదని ఆయన చేసిన ప్రకటనతో కార్మికుల్లో కొంత మనోధైర్యం నింపినట్లు అయింది. అయితే కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి వత్తిడి తెస్తారు. పరిస్కారం మార్గాలు ఏమిటి అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సిఉందనే అభిప్రాయాలూ ఉన్నాయి.