గన్నవరంలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం

గన్నవరంలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం
– ల్యాండింగ్ సందర్భంగా అపశృతి
-ప్రయాణికులు సురక్షితం
దోహా నుంచి గన్నవరం వస్తున్న ఎయిర్ ఇండియా విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనే ఉన్న ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎయిరిండియా విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన్ రావు వెల్లడించారు. కాగా, దెబ్బతిన్న విమానం రెక్కలకు మరమ్మతులు నిర్వహించేందుకు నిపుణుల బృందం గన్నవరం వస్తుందని అధికారులు తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: