పట్టభద్రులలో గెలుపెవరిది …?

పట్టభద్రులలో గెలుపెవరిది …?
-అధికార టీఆర్ యస్ కు ఉద్యోగులు నిరుద్యోగులు వ్యతిరేకం
-బీజేపీకి రైతుల సెగ
-సారుకు కలిసిరాని రాజకీయ పార్టీలు
-ఉద్యమకారుడికి అందని ద్రాక్ష గానే పదవులు
-రాణి రుద్రమ ఒంటరి పోరాటం
-తీన్మార్ది అదేదారి
మార్చ్ 14 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం , నల్లగొండ , వరంగల్ జిల్లాలకు సంభందించి ఒక ఎమ్మెల్సీ స్థానానికి, హైద్రాబాద్, మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు ఒక ఎమ్మెల్సీ కలిపి రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం ,నల్లగొండ, వరంగల్ స్థానానికి పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు అనేది చర్చ నీయంశంగా మారింది. అధికార టీఆర్ యస్ నుంచి గతంలో గెలిచినా పల్లా రాజేశ్వరరెడ్డి తిరిగి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం , తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ , మరో తెలంగాణ గొంతుక , తీన్మార్ మల్లన్న , మరో ఉద్యమకారిణి రాణి రుద్రమ , వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గా జయసారథిరెడ్డి , కాంగ్రెస్ అభ్యర్థిగా రాములు నాయక్, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి లతోపాటు మరికొందరు పోటీ పడుతున్నారు.

పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా పనిచేసిన కాలంలో ఎవరిని పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి.ఆయన ఎవరికీ కనపడరు ఎవరికీ వినపడరని ఒక టాక్ ఉంది. ఆయన పట్టభద్రులకు ఏమి చేశారో చెప్పాలనే డిమాండ్ ఉంది. అయితే కేసీఆర్ కోటరీలో ముఖ్యుడుగా పేరుంది. ప్రవేట్ విద్యాలయాలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. టీఆర్ యస్ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. కేసీఆర్ ,కేటీఆర్ లకు అత్యంత దగ్గరగా ఉంటారనే పేరుంది. ఆయన ప్రజలకు నిరుద్యోగులకు ఏమి చేశారో తెలియదు కానీ తాను మాత్రం తన విద్యాసంస్థలను యూనివర్సిటీ గా మార్చుకున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందున ఉద్యోగుల్లో టీఆర్ యస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రాజేశ్వరరెడ్డి ప్రచారంలో సైతం పీఆర్సీ పైన ఎలాంటి స్పష్టత ఇవ్వటంలేదనే విమర్శలు ఉన్నాయి. పైగా కొంతమంది టీఆర్ యస్ నాయకులూ ఉద్యోగులకు చాల ఇచ్చాం ఇంకా ఏమిస్తాం అనేరీతీలో మాట్లాడటం పై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే వారు సమావేశాలు పెట్టుకొని ఉద్యోగసంఘా నాయకులపై వత్తిడి తెస్తున్నారు. అయితే అధికార పార్టీ మంత్రులు ,ఎంపీలు ఎమ్మెల్యే లు ,ఎమ్మెల్సీలు పల్లా గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.

బీజేపీ తన అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డిని పోటీలో నిలిపింది. వ్యక్తిగా ఆయన మంచివాడని పేరుంది. కానీ బీజేపీ అవలంబిస్తున్న విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ , ఇన్ కం టాక్స్ విషయంలో కేంద్రం అవలంబిస్తున్న విధానాలు వైట్ కాలర్ ఉద్యోగులకు ఏమాత్రం సమ్మతంగాలేవు . అంటే కాకుండా ఇటీవల కేంద్ర తెచ్చిన వ్యవసాయ చట్టాలపై పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మాట తప్పటం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ని ప్రవేట్ పరం చేసేందుకు పూనుకోవటం లాంటి విధానపరమైన నిర్ణయాలు ఇబ్బందికరంగా ఆ పార్టీకి మైనస్ గా ఉన్నాయి.

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పోటీలో ఉన్నారు. ఆయనకు మరో ఉద్యమ పార్టీ సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ తప్ప మిగతావారి సహకారం లేకపోవటం మైనస్ గానే ఉంది. అయితే ఉద్యోగ , ఉపాధ్యాయుల్లో , నిరుద్యోగుల్లో , ఆయన పట్ల సానుకూలత కనిపిస్తుంది. అది ఆయన ఓట్ల రూపంలో మలుచుకుంటారా ? లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

మరో ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ … ఇంటి పార్టీ అధ్యక్షుడు . సత్తా ఉన్న నాయకుడు కానీ ఏపార్టీ ఈయనకు సహకారం అందించటంలేదు. ఒంటరి పోరాటం చేస్తున్నారు. బీసీ , ఎస్సీఈ సంఘాలను నమ్ముకున్నారు. అవి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి

వామపక్షాలు బలపరుస్తున్న జయసారధిరెడ్డి వారి బలంపై ఆధారపడ్డారు. గతంలో బలంగా ఉన్న విపక్షాలకు ఇప్పుడు అంట బలం లేదు . ఉపాధ్యాయ సంఘాల ప్రభావం బాగానే ఉన్న అవి ఎంతవరకు సహకరిస్తాయనేది చూడాలి
తీన్మార్ మల్లన్న ఒంటరి పోరాట యోధుడు … కేసీఆర్ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఊరూరా తీరిగి సభలు పెట్టాడు. తనను గెలిపించామని పిలుపునిచ్చాడు. ఈయన యాత్రలకు స్పందన మాత్రం బాగానే వచ్చింది.
రాణి రుద్రమ చురుకైన నాయకురాలు ఎదో చేయాలనే ఆరాటం ఉంది. ఓటర్లు కనికరిస్తే బాగానే ఉంటుంది. కానీ రాజకీయ పార్టీ అండ లేకుండా స్వతంత్రంగా నెగ్గకరావటం కష్టంగానే ఉంటుంది.

కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పోటీలో ఉన్నారు. కానీ ఆపార్టీ కి ఇప్పుడున్న పరిస్థిలో ఓట్లు రావడం ఇబ్బంది కారమే . రాములు నాయక్ తన టాలెంటును చూపించగలిగితే కొంత ప్రయోజనం ఉంటుంది. చివరి వరకు నంచిన కాంగ్రెస్ ఎవరికీ మద్దతు ఇచ్చినా తమపార్టీ పోటీలో లేకపోతె కార్యకర్తలలో మరో అభిప్రాయాలకు అవకాశాలు ఉంటాయనే అభిప్రాయంతో ఉంది. అభ్యర్థిని పెట్టిన సీరియస్ గా పనిచేయటంలేదనే అభిప్రాయాలూ ఉన్నాయి.
మరికొంతమంది అభ్యర్థులు రంగంలో ఉన్న పెద్దగా ప్రభావం చూపేవారు కాదు. పాత మూడుజిల్లాలు కాస్త 11 జిల్లాలుగా విస్తరించాయి . ఓటర్లు 4 లక్షల 91 వేలమంది ఉన్నారు. చాల పెద్ద కసరత్తు ప్రచారం చేయటానికే తడిసి మోపెడు అవుతున్నది. ఓట్ల పోలింగ్ ను భట్టి అందులో 50 శాతం ఓట్లు వస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుస్తారు . అందువల్ల అధికార పార్టీ అభ్యర్థి తో సహా ఎవరికీ అన్ని ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల రెండవ ప్రాధాన్యత ఓట్లపై ఆధారపడవాల్సిందే . అందువల్ల గెలుపెవరిది అనేది చెప్పటం కొంత ఇబ్బందిగానే ఉంటుంది.

 

Leave a Reply

%d bloggers like this: