కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు
బీజేపీలో చేరనుగాక చేరాను
మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటా
మీడియాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తాను కాంగ్రెస్ పార్టీ ని వీడే ప్రసక్తే లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీలో చేరుతున్నట్లు మీరే ప్రకటించారు కదా అని విలేకర్లు ప్రశ్నించట ఒకప్పుడు అన్నమాట నిజమేనన్నారు . కానీ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ లో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీ అభ్యర్థిగా సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నానంటూ ఓ పత్రికలో వచ్చిన న్యూస్ చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. గతంలో తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన మాట వాస్తవమేనని వ్యాఖ్యానించిన ఆయన, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ను వీడబోనని, మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి తాజా ప్రకటన కాంగ్రెస్ కు శుభపరిణామమని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ లో నిరుత్సహం ఆవహించినవేళ రాజగోపాల్ రెడ్డి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆయన నాగార్జున సాగర్ ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తారని ప్రచారం జరగటంపై కూడా ఆయన స్పందించారు. తాను ఆవార్త చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కు కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

 

One thought on “కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Leave a Reply

%d bloggers like this: