Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాత బస్ స్టాండ్ పై ప్రజాబ్యాలెట్ -కొనసాగించాల్సిందే-ప్రజల మనోగతం

పాత బస్ స్టాండ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తున్న నాయకులు

ప్రజా బ్యాలెట్ కు భారీ స్పందన…
పాత బస్టాండ్ ను లోకల్ బస్టాండ్ గా కొనసాగించాలనే డిమాండ్ కు మద్దతుగా 99 శాతం ప్రజలు మద్దతు…
ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ ను లోకల్ బస్టాండ్ గా కొనసాగించాలని నిర్వహించిన ప్రజా బ్యాలెట్ కు భారీ స్పందన వచ్చింది. పలువురు ప్రముఖులు ఓటు వేసే వెళ్ళారు. పాత బస్టాండ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఐదు సెంటర్ల లో ప్రజా బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించిన పరిరక్షణ కమిటీ. మెత్తం 2773 ఓట్లు పోల్ కాగా లోకల్ బస్టాండ్ గా కొనసాగించాలని 2726 మంది మద్దతు తెలిపారు. వ్యతిరేకంగా 46 మంది అభిప్రాయం తెలిపారు. ప్రముఖ డాక్టర్ సి భారవి ఆధ్వర్యంలో లెక్కుంపు జరిగింది. బస్టాండ్ వద్ద జరిగిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమం సందర్భంగా కార్పొరేటర్లు అఫ్రోజ్ సమీనా, దీపక్ చౌదరి , కాంగ్రెస్ సీటీ అధ్యక్షుడు జావిద్, ML పార్టీ నాయకుడు చందు మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి అయిన పాత బస్టాండ్ ను లోకల్ బస్టాండ్ గా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారం వుందని ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు సహించరు అని విమర్శించారు. నగరంలో అన్నీ వర్గాలను కలుపుకుని రాజకియాలుకు అతీతంగా ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై విక్రమ్, జబ్బార్, బేగం, భాస్కర్, షరీఫ్, అజిత తదితరులు పాల్గొన్నారు

Related posts

రాఘురామ వైద్య పరీక్షల రిపోర్ట్ స్పెషల్ మెసెంజర్ ద్వారా హైకోర్టు కు…

Drukpadam

ఖమ్మం జర్నలిస్టులకు ఐదు ఎకరాల స్థలం ఎలా సరిపోతుంది …సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా…

Drukpadam

కరోనా కట్టడికి ‘బ్రేక్‌ ద చైన్‌’ మహారాష్ట్ర నినాదం…లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదు అంటున్న బెంగాల్ సీఎం

Drukpadam

Leave a Comment