Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేరళపై కమలం కన్ను…

కేరళపై కమలం కన్ను
-వామపక్షలు ,కాంగ్రెస్ నుంచి భారీగా బీజేపీలో చేర్చుకునేందుకు పావులు
-మెట్రో శ్రీధరన్ చేరికపై బీజేపీలో జోష్
-మరి కొంతమంది రిటైర్ అధికారులు బీజేపీ వైపు చూపు
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో సిపిఎం ను ఓడించి అనూహ్యంగా అధికారంలో కి వచ్చిన బీజేపీ అదే ఫార్ములాను కేరళలో అవలంబించాలని చూస్తుంది. అందులో భాగంగానే వివిధ పార్టీల నుంచి వలసలను ప్రోత్సవిస్తున్నారు. భారీ స్థాయిలో చేరికలు రంగం సిద్ధం చేసినట్లు కమలనాధులు చెబుతున్నారు. త్రిపురలోలాగే కేరళలో కూడా సిపిఎం బలంగా ఉన్నందున త్రిపుర ఫార్మాలను అమలు చేయాలనీ బీజేపీ పథకంగా ఉంది. బీజేపీ తన మార్క్ విధానాల ద్వారా చేస్తున్న ప్రయత్నాలపై కేరళ ప్రజలు ఏవిందంగా రిసీవ్ చేసుకుంటారో అనేది ఆసక్తి గా ఉంది. . దక్షిణాదిన పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి ఒక్క కర్ణాటక మినహా ప్రత్యేకమైన రాష్ట్రం లేదు . అందువల్ల కేరళపై కమలనాధులు కన్నేశారు. మెట్రో మెన్ గా పేరొందిన శ్రీధరన్ తాను బీజేపీలో చేరి కేరళ ముఖ్యమంత్రి కావాలనే తన అభిలాషను వ్యక్తం చేశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు . వయసు పైబడ్డ వృద్ధ నేత . వృద్ధనేతలకు అధికారంలో చోటు కల్పించకూడని బీజేపీ విధానపరమైన నిర్ణయంగా ఉంది. అందువల్లనే ఎల్ కే అద్వానీ , మురళి మనోహారాజోషి లాంటి నేతలకు గత లోకసభ ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వ నిరాకరించారు. ఇప్పుడు శ్రీధరన్ కోసం తమ విధానాన్ని మార్చుకుంటారా? అని మాజీ ఆర్ధికమంత్రి యస్వంత్ సిన్హా అంటున్నారు. వివిధ పార్టీల నుంచి ప్రధానంగా వామపక్షాల నుంచి 91 మాజీలు బీజేపీలో చేరనున్నారని కేరళ బీజేపీ నేతలు సంఖ్యతో సహా ప్రకటించటం ఆసక్తిగా మారింది. వీరంతా ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్నవారా? పార్టీకి దూరంగా ఉన్నవారా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. వామపక్షాలు మాత్రం మా కార్యకర్తలు ఎవరు ఇతర పార్టీలలో చేరటం లేదని అంటున్నాయి. వామపక్షాలతో పాటు కాంగ్రెస్ లతో సహా ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరేందుకు ఉత్సహం చూపుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు అమిత్ షా పర్యటనలో చేరతారని అంటున్నారు. అనేక మంది రిటైర్ అయినా ఉన్నతాధికారులు కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీజేపీ కేరళలో పట్టుకోసం చేస్తున్న ప్రయత్నాలపై కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ప్రత్యేక నాయకులను ఎంపిక చేసింది.ఇప్పటికే వారు త్రివేండ్రంలో మకాం వేసి కేరళ పరిణామాలపై కేంద్ర నాయకత్వానికి నివేదికలు అందిస్తున్నారు. సిపిఎం నాయకత్వంలోని ఎల్ డి ఎఫ్ ప్రస్తుతం అధికారంలో ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూ డి ఎఫ్ కూడా బలంగానే ఉంది. ఈ రెండు కూటములు కేరళ రాజకీయాలలో కీలకంగా ఉన్నాయి. వాటికీ ప్రత్యాన్మాయంగా బీజేపీ కేరళలో పాగా వేయాలని చేస్తుంది. కేరళ ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు . బీజేపీ కి చోటిస్తారా ? అది అధికారంలోకి వస్తుందా ? అంత సీన్ ఉండ అనే చర్చ జరుగుతుంది. అయితే రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . కేరళలో ఏమి జరుగుతుందో చూద్దాం …

Related posts

వైసిపిని తిట్టి పవన్ పై అభిమానం చాటుకున్న హైపర్ అది …!

Drukpadam

గులాబీ దళపతిగా పదవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్!

Drukpadam

సోనియా, రాహుల్​ తో తమిళనాడు సీఎం స్టాలిన్ దంపతుల సమావేశం…

Drukpadam

Leave a Comment