ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం

ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తృటిలో ప్రమాదం తప్పింది . కొండగట్టు నుంచి జగిత్యాల వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి గాయాలు కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కాన్యాయ్ లో ముందు వెళుతున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఒకదాని వెంట మాతో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రాజారాంపల్లి వద్దకు రాగానే జగిత్యాల ఎమ్మెల్యే సుంకరవి కారు కవిత కారుకు తగలటంతో అప్రమత్తమైన కవిత కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే రవి కార్లలోనే ఉన్నారు. వారికీ ఎలాంటి ప్రమాదం లేకపోవటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

%d bloggers like this: