Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లోకల్ బస్ స్టాండ్ కోసమే పాత బస్ స్టాండ్ …మాజీమంత్రి తుమ్మల

లోకల్ బస్ స్టాండ్ కోసమే పాత బస్ స్టాండ్…మాజీ మంత్రి తుమ్మల
పాత బస్ స్టాండ్ ను లోకల్ బస్ స్టాండ్ గా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే కొత్త బస్ స్టాండ్ కు స్థలం ఎంపిక చేయటం జరిగిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాత బస్ స్టాండ్ పరిరక్షణ కమిటీ ఆధ్వరంలో ఆదివారం ఖమ్మం లో ఆయన నివాసంలో పరిరక్షణ కమిటీ సభ్యులు కలసిన సందర్భంగా పై విధంగా వ్యాఖ్యనించారు. ఖమ్మం నగరానికి ఇప్పుడున్న బస్ స్టాండ్ సరిపోవటం లేదని అందువల్ల అన్ని హంగులతో రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా హైటెక్ బస్ స్టాండ్ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ఖమ్మం వచ్చినప్పుడు ఎన్ ఎస్ పి లో స్థలం చూపించి కోరడం జరిగిందన్నారు. దానికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే 7 .5 ఎకరాల స్థలాన్ని కేటాయించటం జరిగిందన్నారు.కొత్త బస్ స్టాండ్ కట్టినప్పటికీ ఇప్పుడు ఉన్న పాత బస్ స్టాండ్ ను లోకల్ బస్ లు నడిపేందుకు ఉపయోగిస్తామని చెప్పటం జరిగిందన్నారు. కొత్త బస్ స్టాండ్ ఎక్సుప్రెస్ ,డీలక్స్ హైటెక్ ,వీడియో కోచ్ ,ఇంద్ర ,రాజధాని లాంటి ఏసీ బస్ లు నడిపేందుకు ప్రతిపాదించామని తెలిపారు. ఖమ్మం పట్టణాన్ని నగరంగా అభివృద్ధి చేయటంతో పాటు కార్పొరేషన్ హోదా కల్పించి మంచినీటి శాశ్విత పరిస్కారం కోసం కృషి చేసిన విషయాన్నీ ఆయన గుర్తుచేశారు.ఐటీ హబ్ ఖమ్మం కు తెచ్చిన ఘనత కూడా తనదే నన్నారు. ఖమ్మం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రోడ్లు ఏర్పాటు, విస్తరణ , బై పాస్ రోడ్ తెచ్చామని రింగురోడ్డు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశామన్నారు. రాష్ట్రానికి వచ్చే రోడ్ల కనెక్టవిటీని ఖమ్మం జిల్లాకు వచ్చే విధంగా చేసి నిధులు కూడా మంజూరు చేయించటం జరిగిందన్నారు. ఖమ్మం నుంచి సూర్యాపేట రోడ్ నాలుగు లేన్ల గా ప్రదిపాదించి నేషనల్ హైవే తో అనుసంధానం చేసి గడ్కరీతో నిధులు మంజూరి చేయించానని అన్నారు. జిల్లా అభివృద్ధిలో రోడ్ల పాత్ర ఎంతో ఉందని ఎక్సప్రెస్ హైవే రావటానికి తన కృషే కారణమన్నారు. తుమ్మలను కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫువాళ్ళ దుర్గాప్రసాద్ , మున్సిపల్ చైర్మన్ అఫ్రోజ్ సమీనా ,సిపిఎం నాయకులూ యర్రా శ్రీకాంత్ , విక్రమ్, యర్రా శ్రీనివాస్ రావు కాంగ్రెస్ నాయకులూ జావేద్ ,దీపక్ చౌదరి , ఎం ఎల్ న్యూ డెమోక్రసీ నాయకులూ అశోక్ తదితరులు ఉన్నారు.

Related posts

రిలయన్స్ జియో నుంచి ‘భారత్ జీపీటీ’.. అతిపెద్ద భాషా మోడల్‌ అవుతుందన్న జియో

Ram Narayana

ఎన్టీఆర్‌‌కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా: పురందేశ్వరి

Ram Narayana

బరాదర్ చనిపోలేదు.. ఆడియో విడుదల చేసిన తాలిబన్లు…

Drukpadam

Leave a Comment