Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ లో మోడీ చిచ్చు…

కాంగ్రెస్ లో మోడీ చిచ్చు…
మోదీపై గులాంనబీ ఆజాద్ చేసింది పొగడ్తలు కాదట!
ఇటీవల జమ్మూలో మోదీపై ఆజాద్ వ్యాఖ్యలు
మోదీ టీ కూడా అమ్మారన్న ఆజాద్
ఆయన వ్యక్తిత్వాన్ని దాచుకోని నైజం తనకిష్టమని వివరణ
ఆజాద్ చేసింది పొగడ్తలు కాదంటున్న సన్నిహిత వర్గాలు
త్వరలోనే ఆజాద్ వివరణ ఇస్తారని వెల్లడి
ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబి ఆజాద్ రిటైర్ మెంట్ సందర్భంగా కాంగ్రెస్ లో చిచ్చు రేపాయి. నిజంగానే గులాం నబి ఆజాద్ ను మెచ్చుకున్నారా? లేక కాంగ్రెస్ పార్టీలో ఉన్న విబేధాలను ఉపయోగించుఇకోవాలని అనుకున్నారా అనే విషయం పై ఆశక్తి నెలకొన్నది . బీజేపీ ,కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ లోని అసమ్మతి నేతను ఆకాశానికి ఎత్తటం ఆయనకూడా అదే స్థాయిలో ప్రధానిని పొగడటం దేశవ్యాపితంగా చర్చకు దారితీసింది. అంతటితో ఆగకుండా జమ్మూ కాశ్మీర్ లో గుజ్జర్లు ఏర్పాటు చేసిన సమావేశంలో గులాం నబి ఆజాద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తన మనసులో ఉన్న మాటను దాచుకోదని , ఆయన మూలాలు మర్చిపోలేదని తాను చాయ్ అమ్మిన విషయం కూడా మర్చిపోలేదని ఆయన గొప్పతనాన్ని గురించి ప్రస్తావించటం కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచే దానిలో భాగమేనని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. జమ్మూలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ లో అసమ్మతి రాగం వినిపిస్తున్న నాయకులూ ఉండటం విశేషం . దీని తరువాత అసమ్మతి వాదుల్లో ఒకరైన ఆనంద్ శర్మ పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఒక ముస్లిం పార్టీతో పొత్తు పెట్టుకోవటాన్ని బహిరంగానే తప్పుపట్టడం కాంగ్రెస్ లోని అసమ్మతి వాదుల వైఖరిని తెలియజేస్తుందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
గులాంనబీ ఆజాద్ ప్రధాని నరేంద్ర మోదీ నిరాడంబరతను, ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించిన వ్యక్తి ఇప్పుడు పార్టీ కష్ట కాలంలో ఉండగా ప్రధాని భజన చేయటంపై కాంగ్రెస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. అయితే ఆజాద్ సన్నిహితవర్గాలు మాత్రం ఆ వ్యాఖ్యలు మోదీని పొగుడుతూ చేసినవి కావని అంటున్నాయి. ఆ వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్ధం చేసుకున్నారని, సరైన సమయంలో ఆజాద్ వాటిపై స్పష్టత ఇస్తారని తెలిపాయి. తాను గతంలో టీ అమ్మానని ప్రధాని చెప్పుకుంటుండడాన్ని మాత్రమే ఆజాద్ ప్రస్తావించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇటీవల గులాంనబీ ఆజాద్ జమ్మూలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, అనేకమంది నేతల్లో తాను పలు అంశాలను ఇష్టపడతానని చెప్పారు. మన ప్రధాని మోదీ కూడా ఓ గ్రామం నుంచి వచ్చినవాడేనని, ఆయన తాను టీ అమ్మానని చెప్పుకుంటుంటారని ఆజాద్ తెలిపారు. తాము రాజకీయ ప్రత్యర్థులమే అయినా, ఆయన తన అంతరంగాన్ని దాచుకోకపోవడాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్న విషయం విదితమే .

Related posts

కర్ణాటకలో సీఎం కుర్చీ మహాకాస్టలీ అంటున్నకేటీఆర్!

Drukpadam

రాజీనామా చేసే సమస్యే లేదన్న మణిపూర్ సీఎం

Ram Narayana

రజనీకాంత్ తో కమల్ హాసన్ భేటీ…

Drukpadam

Leave a Comment