కేసీఆర్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు…

కేసీఆర్ పై  బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
-యువమోర్చ అధ్యక్షుడిపై చేయి పడితే ఫారం హౌస్ పై చేయాల్సివస్తుంది హెచ్చరిక
-కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం
-ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
-బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఖబర్ధార్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి కేసీఆర్ పై రెచ్చి పోయారు.రాష్ట్రంలో ఉద్యోగుల భర్తీ విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై విమ్మర్శలు ఉండగా బీజేపీ మరో అడుగు ముందుకేసి ఉపాధి కల్పనా కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై బీజేపీ మండిపడింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షడు భానుప్రకాష్ ఆధ్వరంలో జరిగిన ఈ ధర్నా సందర్భగా ఆయన్ను పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్ట్ చేశారు.ఈ అరెస్ట్ పై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ధర్నా చేస్తేనే అరెస్ట్ చేస్తారా ? అంటూ ప్రభుత్వ చర్యలను దుయ్యబట్టారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఖాకి లెక్కలు చెబుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ లాలూ ప్రసాద్ యాదవ్ , కరుణానిధిలాగా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఇప్పటికైనా తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు.

Leave a Reply

%d bloggers like this: