Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ కు షాక్ -షర్మిల పార్టీలోకి ఇందిరా శోభన్

కాంగ్రెస్ కు షాక్ -షర్మిల పార్టీలోకి ఇందిరా శోభన్
-ఇప్పటికే పలువురు షర్మిలకు జై కొడుతున్న వైనం
– కుల సంఘాలు,సామాజిక ఉద్యమకారులు షర్మిల భేటీ
-టీఆర్ యస్ కార్యకర్తలు సైతం షర్మిలతో భేటీ
-లోటస్ పాండ్ పై ఇంటలిజన్స్ నిఘా
షర్మిల తో కలిసి పనిచేసేందుకు అనేక పార్టీలనుంచి క్యూ కడుతున్నారు. ఇప్పటికే టీఆర్ యస్ కు చెందిన ఒక ముఖ్యనేత షర్మిలను కలవగా తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఇప్పుడు షర్మిలను లోటస్ పాండ్ లో కలవడం చర్చ నీయాంశం అయింది. ఆమె చాలాకాలం నుంచి యాక్టీవ్ గా అనేక టీవీ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ వాణిని చాల గట్టిగ వినిపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడినా ఏలాంటి గుర్తింపులేదని,మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనేకసార్లు తన ఆవేదనను చెప్పేందుకు ప్రయత్నం చేసిన పెద్దలు పట్టించుకోలేదని అన్నారు. అందువల్లనే తాను పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి లేఖ రాశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందనే కారణంతోనే తాను ఇంతకాలం పార్టీలో కోన సాగనని తెలిపారు.తాను తెలంగాణ బిడ్డగా కాంగ్రెస్ పార్టీలో చేరి పని చేశానని ఎలాంటి పదవులు ఆశించలేదని అన్నారు.కొన్ని రోజులుగా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నతీరు తనను కలిచి వేసిందన్నారు. అందువల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.షర్మిలతో కలిసిన అనంతరం ఆమె అనేక విషయాలు షర్మిల తెలుసుకున్నారని తాను కూడా ఆమెతో కలిసి పనిచేయాలని అనుకున్నానని తెలిపారు. తెలంగాణ పట్ల ఆమెకు ఒక విజన్ ఉందని అన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం అవుతున్న షర్మిల నల్లగొండ నుంచి ప్రారంభించి హైద్రాబాద్, రంగారెడ్డి,మహబూబ్ నగర్ , తదితర జిల్లాలో నేతలతో సమావేశం అయ్యారు. కుల సంఘాల నేతలను కలిశారు. సామాజిక సేవ కార్యకర్తలను ,విద్యార్థులను ఆమె కలిసి అనేక విషయాలు వారినుంచి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీసలహాదారు రామచంద్రమూర్తి సైతం ఆమెను కలిశారు.వైయస్ హయాంలో ఆయన దగ్గర పనిచేసిన ప్రభాకర్ రెడ్డి ,ఉదయసింహ లాంటి ఉన్నతాధికారులు ఆమెతో కలిసి పని చేస్తారని వారు ఆమె తో భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. షర్మిల పార్టీ పెడతారని వార్తలు వచ్చిన తరువాత లోటస్ పాండ్ రద్దీగా మారింది.నిత్యం వాచిపోయేవారితో కళకలాడుతుంది.అన్ని రాజకీయ పార్టీలు షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. తమ వారు ఎవరైనా కలుస్తున్నారా అనే దాన్ని ఆరా తీస్తుండగా నిఘా వర్గాలు సైతం లోటస్ పాండ్ పై కన్నేశాయి. వైయస్ పథకాలు , పేదలకు చేసిన మేళ్ల గురించి నిత్యం వచ్చిన వారితో చర్చిస్తున్నారు. అనేక మంది తమ తమ ప్రాంతాలలో ఉన్న రాజకీయ పరిస్థితులను వివరిస్తున్నారు. నిత్యం వారిని కలుస్తూనే పార్టీ ఏర్పాటుపై ముఖ్యులతో సమావేశం అవుతున్నారు.
ఆమె పార్టీ పెట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తుండగా ఆమె పెట్టబోయే పార్టీ జెండా ఎజెండా గురించి కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. చివరగా ఆమె ఖమ్మం లో ఏప్రిల్ 9 పెద్ద బహిరంగ సభ పెట్టేందుకు సిద్దపడుతున్నారు. ఖమ్మం పర్యటన నాటికీ ఆమె పార్టీ విధివిధానాల పై పూర్తీ స్థాయిలో క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. పార్టీ ప్రకటన నాటికీ కొంత మంది ముఖ్యలు షర్మిల పార్టీలో జాయిన్ అవుతారని సమాచారం.

Related posts

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక …సొంత రాష్ట్రం నుంచే శశిథరూర్ కు వ్యతిరేకత …

Drukpadam

ట్రంప్ చర్యలపై ముప్పేట దాడి

Drukpadam

పొత్తుల్లో తేడా వస్తే …బలమున్న చోట లెఫ్ట్ పార్టీలు పోటీ …కూనంనేని

Drukpadam

Leave a Comment