Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

శశికళ అస్త్రసన్యాసం వెనుక బీజేపీ ఉందా…?

శశికళ అస్త్రసన్యాసం వెనుక బీజేపీ ఉందా…?
-తమిళనాట ఇదే ఎడతెగని చర్చ
-రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శశికళ ప్రకటన
-తమిళనాట సంచలనం సృష్టించిన ఆమె వ్యాఖ్యలు
-గత నెలలోనే డీల్ కుదిరిపోయిందని కామెంట్లు

తమిళనాట చిన్నమ్మ గా ప్రసిద్ధిచెందిన శశికళ అకస్మాత్తుగా తాను రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించటం వెనక బీజేపీ ఉందా అంటే ….. ఉందనే అంటున్నారు. పరిశీలకులు.తమిళనాట ఈమాట కోడై కూస్తుంది. జయలలిత మరణాంతరం ముఖ్యమంత్రి కావాలని కలలు గన్న చిన్నమ్మ ప్రకటన వెనక పెద్ద రాజకీయమే నడిచిందని ప్రచారం జరుగుతుంది.శశికళ ఎన్నికలలో సైలెంట్ గా లేకపోతె తిరిగి అన్నా డీఎంకే అధికారంలోకి రాదని భావించిన బీజేపీ ఆమె పై వత్తిడి తెచ్చి ఎన్నికలకు దూరంగా ఉంచేలా చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇది బీజేపీ, అన్నా డీఎంకే కూటమికి లాభమా ? నష్టమా ? అంటే లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాలే వెల్లడౌతున్నాయి . ఆమె జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై కక్ష తీర్చుకోవాలని అనుకున్నారు. అందుకనుగుణంగా తన కార్యాచరణను ప్రారంభించారు. ఆమె పట్ల ప్రజల్లో ఆదరణ కనపడింది.దీంతో కంగు తిన్న అన్నా డీఎంకే ,బీజేపీ కూటమి కేంద్రంలోని బీజేపీ పెద్దలను ఆశ్రయించటం వారు రంగంలోకి దిగటం జరిగిపోయాయి. ఫలితంగానే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చెన్నై వచ్చి చిన్నమ్మ రాజకీయాల నుంచి తప్పుకునేలా పధక రచన చేసినట్లు చర్చ జరుగుతుంది. జరుగుతున్నా చర్చ నిజమే అయితే డీఎంకే కూటమి నెత్తిన పాలు పోసినట్లేననే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం గత నెలలో ఆమె విడుదలైన వేళ, అన్నాడీఎంకేలోని ఓ వర్గం తిరిగి తమకు మంచిరోజులు వస్తాయని భావించింది. ఆమె దగ్గరి బంధువు టీటీవీ దినకరన్, ఏకంగా తానే సీఎంను అవుతానన్న ధీమాను కూడా వ్యక్తం చేశారు. అయితే, అనూహ్యంగా తాను ఇక రాజకీయాల్లో ఉండబోనని ఆమె స్పష్టం చేయడం తమిళనాడు ప్రజలను షాక్ నకు గురి చేసింది.

రాష్ట్ర రాజకీయాలను మరో మలుపు తిప్పుతారన్న అభిప్రాయాన్ని తన క్యాడర్ లో కల్పించి, ఆపై అర్థాంతరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నిన్న రాత్రి శశికళ చేసిన ప్రకటన తీవ్ర సంచలనం సృష్టించింది.ఇంత సంచలన నిర్ణయాన్ని శశికళ తీసుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఇప్పుడు తమిళనాడులో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుందని, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మరోమారు అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ఒపీనియన్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ దశలో శశికళ తిరిగి రాజకీయాల్లో కొనసాగితే అన్నాడీఎంకేలో చీలిక రావడం ఖాయమని భావించిన బీజేపీ, అన్నాడీఎంకే విడిపోకుండా ఉండాలంటే, తాత్కాలికంగానైనా శశికళను రాజకీయాలకు దూరంగా ఉంచాలని భావించినట్టు వార్తలు వస్తున్నాయి.

గత నెలలో అమిత్ షా తమిళనాడులో పర్యటించిన సమయంలోనే శశికళతో డీల్ కుదిరిపోయిందని తమిళనాడు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అందులో భాగంగానే ఆమె ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అదే నిజమైతే, ఎన్డీయే నేతృత్వంలో అన్నాడీఎంకే తిరిగి తమిళనాడులో అధికారంలోకి వస్తే చాలని భావిస్తున్న బీజేపీ, ఆ మేరకు ప్రస్తుతానికి విజయవంతం అయినట్టే. ఇక కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉన్న డీఎంకే మాత్రం పరిస్థితి ఏదైనా, ఎవరు బరిలో ఉన్నా గెలుపు మాత్రం తమదేనని ఘంటాపథంగా చెబుతోంది.

కాగా, దివంగత జయలలిత అధికారంలో ఉన్నప్పుడుగానీ, పదవిలో లేనప్పుడుగానీ తాను ఎన్నడూ అధికారం, పదవుల కోసం పాకులాడలేదని, ఆమె మరణించిన తరువాత కూడా తనకు ఎటువంటి పదవీకాంక్ష లేదని నిన్న శశికళ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమ్మ (జయలలిత) స్థాపించిన ఏఐఏడీఎంకే మరో మారు గెలవాలన్నదే తన కోరికని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

Related posts

అమరావతిపై చంద్రబాబు నాటకాలు …మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్ ..

Drukpadam

రాహుల్ రైలు ప్రయాణం …ఢిల్లీ టు ఉదయ్ పూర్!

Drukpadam

రేవంత్ రెడ్డికి మద్దతుగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు…!

Drukpadam

Leave a Comment