Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆజాద్ అండ్ టీం ప్రచారం చేస్తానంటుంది…

ఆజాద్ అండ్ టీం ప్రచారం చేస్తానంటుంది…
-సోనియా నుంచి స్పందనలేదు
-ప్రత్యర్థులను పొగడటం పార్టీలో గుర్రు
-మోడీ పాలనా పై పాలనపై కాకుండా పార్టీ పై దాడా అంటూ ఆగ్రహం ?
కాంగ్రెస్ పార్టీలో రెబల్ లీడర్స్ గా ఉన్న ఆజాద్ అండ్ టీం ఎన్నికలు జరుగుతున్నా రాష్ట్రాలలో ప్రచారం చేస్తామంటుంది.అందుకు అధ్యక్షురాలు సోనియా నుంచి గానీ పార్టీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు బహుశా వారి ప్రచారం లాభంకన్నా నష్టం ఎక్కువ చేస్తుందని అభిప్రాయపడి ఉండవచ్చు. అభిప్రాయాలూ చెప్పటంలో తప్పులేదు.అవి కేవలం పార్టీ వేదికల వరకే పరిమితం కావాలి కానీ రెబల్స్ చేస్తుంది అందుకు భిన్నంగా ఉంది. ప్రత్యర్థులను పొగడటం ,కాంగ్రెస్ ను తెగడటం ఇందుకు వేదికలను ఉపయోగించుకోవటం అనే విమర్శలు ఉన్నాయి. పార్టీలోని అనేకమంది వారిపై ప్రవర్తనపై గుర్రుగా ఉన్నారు. మోదీపాలనపై కాకుండా పార్టీపై దాడి చేయటంపై ఆగ్రహంగా ఉన్నారు.
ఇప్పటికే ఆజాద్ తో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కి లేక రాసిన 23 మంది విషయంలో పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.కాంగ్రెస్ లో అధ్యక్ష ఎన్నికలకు ఎన్నికలు జరగాలని అధ్యక్షుడిని ఎన్నుకోవాలని డిమాండ్ వరకు ఎవరికీ అభ్యతరం లేదు. దీనిపై ఇప్పటికే పార్టీలో చర్చ జరుగుతుంది. అధ్యక్షుడు లేకుండానే పార్టీ కొన్ని రోజులపాటు ఉండటంపై కొందరు పెద్ద నేతలు ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ లోని చాలామంది వారిచర్యలను సమర్థించారు. అధ్యక్షుడు లేకుండా పార్టీని నడపటం సరైందికాదని అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. కానీ ప్రతిసారి రాహుల్ ను వారి కుటుంబాన్ని టార్గట్ చేస్తూ 23 మందిలో కొందరు ఇంటాబయటా విమర్శలు చేయటం సరైంది కాదనే అభిప్రాయాలూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల దగ్గరనుంచి పార్టీలో అసమ్మతి రాగం బయలు దేరింది. ఎన్నికల్లో పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల అనంతరం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికలలో పనితీరుపై ప్రత్యేకించి అధికారంలో ఉన్నరాష్ట్రాలలో ఫలితాలు సరిగా రాకపోవడంపై చర్చించింది . ఈ సందర్భంగా ముఖ్యమంత్రుల రాష్ట్రాలలో కూడా ఎంపీ సీట్లు గెలవకపోవడం ,వారి బందువులకు టిక్కెట్ల కోసం కొందరు పట్టుబట్టటంపై రాహుల్ ,ప్రియాంక నాయకులను ప్రశ్నించారని ప్రచారం జరిగింది. దీనితో కొందరు నాయకులూ అప్పటినుంచే సోనియా కుటుంబంపై ప్రత్యేకించి రాహుల్ ను టార్గెట్ చేయటం ప్రారంభించారు. కాంగ్రెస్ లో జరుగుతున్నా పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఎదురుచూస్తున్నా బీజేపీకి జోతిరాధిత్య సింధియా రూపంలో ఒక ఆయుధం దొరికింది. ఆతరువాత సచిన్ పైలెట్ కోసం చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ తిప్పికొట్టగలిగింది. ఇందులో రాహుల్ , ప్రియాంక కీలకంగా వ్యహరిచారు. ఇక గ్రూప్ ఆఫ్ 23 మందిలో ముఖ్యనేతగా ఉన్న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ రిటైర్ ను ప్రధాని చాల తెలివిగా ఉపయోగించుకున్నాడు. ఆయన్న ఆకాశానికి ఎత్తారు .పొగడ్తలు కురిపించారు. కన్నీళ్లు పెట్టారు.దీనికి ఆజాద్ మనసు కరిగిపోయింది. ఇంకేముంది. ప్రధాని అంతటి గొప్ప వ్యక్తిని చూడలేదన్నారు. ఇంతటితో ఆగకుండా సమయం దొరికినప్పుడల్లా ప్రధానిని పొగడటం ఆజాద్ చేస్తుండటం కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడుపడని వ్యవహారంగా మారింది. దీనికి తోడు జమ్మూ కాశ్మిర్ లో జరిగిన ఒక కార్యక్రమానికి జి -23 సభ్యులు వెళ్లారు.అక్కడ ప్రధానిని పొగడటం జరిగింది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలలో ఒక పార్టీతో కాంగ్రెస్ పెట్టుకున్న పొత్తును తప్పుపడుతూ భహిరంగ ప్రకటన చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అలంటి ఆజాద్ అండ్ టీం తాము ఎన్నికల ప్రచారానికి పిలిస్తే వచ్చి ప్రచారం చేస్తామని చెప్పటం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ ప్రచారంలో మీడియా అడిగితె ప్రత్యర్థులను పొగిడి వారు అడిగారు కాబట్టి పొగిడామని అంటారా ? అని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.అందువల్ల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నా కోల్డ్ వార్ భహిరంగ వార్ గా మారుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి మరి !!!

Related posts

పట్టభద్రులు అమ్ముడుపోయారా?

Drukpadam

మోడీ పాలన కొనసాగితే ప్రజలకు మరింత కష్టం ….సోనియాగాంధీ హెచ్చరిక!

Drukpadam

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్ఫ్యూజన్ లో ఉన్నారా ? కన్ఫ్యూజన్ చేస్తున్నారా ??

Drukpadam

Leave a Comment