Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రూట్ మార్చి సైకిల్ ఎక్కిన సీఎల్పీ నేత భట్టి

రూట్ మార్చి సైకిల్ ఎక్కిన సీఎల్పీ నేత భట్టి
-కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో సైకిల్ యాత్ర
-కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధనపైనే ఫోకస్
-ఈ సారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకే పరిమితం
-కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ ను గెలిపించాలని పిలుపు
సీఎల్పీ నేత మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఈ సారి తన రూట్ మార్చారు.ఎమ్మెల్సీ ఎన్నికలు , కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలని భావించిన ఆయన సైకిల్ యాత్ర చేపట్టారు. కొద్దిరోజుల క్రితమే ఆయన రాష్ట్రంలో సుదీర్ఘంగా రైతు వ్యతిరేక చట్టాలపై పర్యటన చేశారు. రైతులతో ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించారు . కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల కలిగే నష్టాలను ఆయన తన యాత్రలలో రైతులకు అర్థం అయ్యే విధంగా చెప్పారు. భట్టి పర్యటనలకు మంచి స్పందనే వచ్చింది . వెలది మంది రైతులు ఆయన కార్యక్రమాలకు హాజరైయ్యారు. రైతుల విషయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ను వివరించటంలో విజయవంతమైయ్యారు. దాని స్ఫూర్తిగానే ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని వైరటీగా నిర్వహించాలని భావించినట్లు ఉన్నారు. అందుకే ఆయన ఈ సారి సైకిల్ ఎక్కారు. భద్రాద్రి కొత్తగూడం జిల్లా నుంచి ప్రారంభమైయ్యే సైకిల్ యాత్ర ఆరు రోజులపాటు కొనసాగి మార్చ్ 12 లో ముగించేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ యాత్ర ప్రారంభానికి ముందు ఆయన భద్రాద్రి రాముణ్ణి దర్శించుకోనున్నారు. ఇప్పటికే తన పదునైన మాటలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుక పడుతున్న భట్టి సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టటం చర్చనీయాంశం అయింది. భద్రాచలం నుంచి ప్రారంభమైన భట్టి సైకిల్ యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , భద్రాచలం శాసనసభ్యుడు పొదెం వీరయ్య ఖమ్మం , మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలు పాల్గొంటున్నారు. ఈ యాత్ర వారం రోజుల పాటు సాగనున్నది . ప్రధానంగా రాష్ట్రంలో టీఆర్ యస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో నిరుద్యోగులను, పీఆర్సీ ఇవ్వకుండా ఉద్యోగులను మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు . ఆరు సంవత్సరాల కేసీఆర్ పాలనలో అభివృద్ధి లేక పొగ అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు. ప్రాజక్టుల పేరుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టులనే పేర్లు మార్చి అంచనాలు మార్చి దోచుకుంటున్నారని కేసీఆర్ ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు . రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కేసీఆర్ ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలిచి తనకు ప్రజా మద్దతు ఉందని మోయలేని బారాలు వేసి ప్రజల నడ్డి విరగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ మాటలను కులాలను రెచ్చగొట్టటం ద్వారా అధికారంలోకి రావాలని కలలు గంతుందని విమర్శించారు. డీజిల్ ,పెట్రోల్ రేట్లు పెరగటానికి , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల వైఖరే కారణమేమి అన్నారు. అందుకే తాను సైకిలు యాత్రను ఎంచుకున్నానని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలు ప్రత్యేకించి విజ్ఞులైన పట్టభద్రులు ఆలోచించి ఓటు ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ను గెలిపించాలని అన్నారు.

Related posts

కాబూల్ లో ఎంబసీని ఖాళీ చేసిన ఇండియా.. స్పెషల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ద్వారా సిబ్బంది తరలింపు!

Drukpadam

పార్టీకి ఫుల్ టైం అధ్యక్షురాలిని నేనే: సీడబ్ల్యూసీ మీటింగ్ లో స్పష్టం చేసిన సోనియా గాంధీ!

Drukpadam

వైసీపీకి షాక్ …. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన ఆనం రాంనారాయణ రెడ్డి కూతురు కైవల్యా!

Drukpadam

Leave a Comment