Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తమిళనాడులో డీఎంకే కూటమికి బీటలు…

తమిళనాడులో డీఎంకే కూటమికి బీటలు
-కూటమినుంచి వైదొలిగేందుకు సిద్దమైన కాంగ్రెస్
-కాంగ్రెస్ తో జత కట్టేందుకు సిద్దమైన కమల్ హాసన్
-రాహుల్ నిర్ణయం కోసం ఎదురు చూపులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. డీఎంకే ,అన్నా డీఎంకే కూటముల జరుగుతున్నా ఈ పోరులో గెలుపుపై రెండు పార్టీలు దీమాగానే ఉన్నాయి. అయితే ఈ సారి రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి , అన్నా డీఎంకే అధి నేత్రి జయలలిత లేకుండా జరుగుతున్నా ఎన్నకలు కావటంతో విజయం ఎవరిని వరిస్తుందన్న ఆశక్తి అందరిలో నెలకొన్నది. కాంగ్రెస్ గత పది సంవత్సరాలుగా డీఎంకే కూటమిలో నమ్మకమైన మిత్ర పక్షంగా ఉన్నది . కానీ ఈ సారి రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో తేడాలొచ్చాయి. దీనితో డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ వైదొలుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ 40 పోటీచేసింది. కానీ గెలిచింది కేవలం 8 సీట్లు మాత్రమే . దీంతో అధికారంలోకి వస్తుందనుకున్న డీఎంకే రాలేక పోయింది. కాంగ్రెస్ వల్లనే తమకు అధికర్మ చేజిక్కలేదని డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. అందువల్ల ఈ సారి కాంగ్రెస్ పార్టీకి 18 సీట్ల కన్నా ఎక్కువ సీట్లు ఇవ్వలేమని డీఎంకే స్పష్టం చేసింది. దీనికి కాంగ్రెస్ అంగీకరించలేదు. గతంలో ఇచ్చిన విధంగానే తమకు 40 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టింది. చివరకు 30 సీట్లు ఇస్తే సర్దుకుంటామని కాంగ్రెస్ తమిళనాడు పార్టీ నాయకులూ డీఎంకే కు స్పష్టం చేశారు. అందుకు డీఎంకే అంగీకరించే పరిస్థితులు కనిపించటం లేదు. దీనితో కూటమిలో కొనసాగే విషయం పై కాంగ్రెస్ ఆలోచనలో పడింది. డీఎంకే నేతలతో చర్చలు జరిపేందుకు వచ్చిన ఉమెన్ చాందీ ని సైతం డీఎంకే పట్టించుకోకుండా అవమాన పరచటం పై కాంగ్రెస్ నేతలు భగ్గుభగ్గు మంటున్నారు. టీపీసీసీ అధ్యక్షులు కే.యస్ అళగిరి చర్చల్లో తనకు జరిగిన అవమానం గురించి కాంగ్రెస్ నేతల సమావేశంలో వివరించి కన్నీళ్లు పెట్టుకోవడం ఆపార్టీ నేతలను కలిచి వేసింది. కరుణానిధి ఉన్న సమయంలో కూడా తమ పార్టీని ఎంతో గౌరవించి మర్యాదగా వ్యవహరించేవారని అలంటి గౌరవం తమకు లభించటంలేదని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. డీఎంకే ధోరణిపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది . అసరమైతే కూటమి కి బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం . అయితే డీఎంకే తో వెళ్లాలా లేదా అనే విషయం పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వదిలి పెట్టాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. మక్కల్ నీది మయ్యాం పార్టీ నేత సినీ నటుడు కమల్ హాసన్ కాంగ్రెస్ డీఎంకే కూటమి నుంచి బయటకు వస్తే వారితో కలిసి ఎన్నికలలో పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారితో ప్రాధమిక చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తుంది . ఇప్పటి వరకు డీఎంకే నుంచి పిలుపు వస్తుందేమోనని ఆశించమని ఎలాంటి పిలుపు రాలేదని అందుకే రాహుల్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని కాంగ్రెస్ నాయకులూ తెలుపుతున్నారు.

 

Related posts

పంజాబ్ లెక్కింపు పూర్తి.. ఆప్‌కు 92 సీట్లు!

Drukpadam

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై దాడి!

Drukpadam

మోడీ ,శరద్ పవర్ భేటీ దేనికి సంకేతం …రాజకీయవర్గాలలో ఆశక్తికర చర్చ!

Drukpadam

Leave a Comment