Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పట్టభద్రుల ఎన్నికలతో హీటెక్కిన రాజకీయాలు

పట్టభద్రుల ఎన్నికలతో హీటెక్కిన రాజకీయాలు…
-హోరెత్తుతున్న ప్రచారం
-పల్లా కోసం మంత్రుల ప్రచారం
-సింపుల్ గా కోదండరాం ప్రచారం
-బీజేపీ తరుపున ప్రేమేందర్ రెడ్డి
-కాంగ్రెస్ నుంచి రాములు నాయక్
-బహుజనముల మద్దతుతో చెరుకు సుధాకర్
-లెఫ్ట్ దండుతో జయసారధి
-తీన్మార్ ,రాణి రుద్రమ ఒంటరి పోరాటం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తో రాజకీయాలు హీటెక్కాయి. పోటీలో మొత్తం 71 మంది అభ్యర్థులు ఉండగా నలుగురైదుగురు మధ్య పోటీ నెలకొన్నది . ప్రధాన పార్టీలైన టీఆర్ యస్ ,కాంగ్రెస్, బీజేపీ , లెఫ్ట్ ,పార్టీల తరుపున ఉన్న అభ్యర్థుల కోసం ఆయా పార్టీలు రంగంలోకి దిగాయి. అధికార టీఆర్ యస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి కోసం అధికార పార్టీ చమటలు కక్కుతోంది. మొత్తం అధికార యంత్రాగం రంగంలోకి దిగింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ మొత్తం కార్యక్రమాలను సమన్వయము చేస్తున్నారు. జిల్లాలో టీఆర్ యస్ ఎమ్మెల్యే లు , జడ్పీ చైర్మన్ లు ,డీసీసీబీ చైర్మన్లు ,ఇతర ముఖ్యనేతలంతా పల్లా గెలుపుకోసం పనిచేస్తున్నారు. ఎంపీ నామ నాగేశ్వరరావు ,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వనిచ్చారు. ఎన్నడూ లేని విధంగా గ్రామాలలో సైతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఉదృతంగా సాగుతుంది. అయితే అక్కడక్కడా అభ్యర్థిపై వ్యతిరేకత కనిపిస్తుంది.అంతే కాకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా తోడు అవుతుంది. అందువల్ల పల్లా గెలుపు నల్లేరు మీద నడక కాదనే అభిప్రాయాలే ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పోటీచేస్తున్నారు. ఆయన బంజారా తెగకు చెందినవారు. ఆయన తరుపున టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో పర్యటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాములు నాయక్ తరుపున వినూత్న ప్రచారం సైకిల్ యాత్ర ద్వారా చేస్తున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఆయన ప్రచారం జరుగుతుంది. భద్రాచలం నుంచి ప్రారంభమైన భట్టి యాత్రకు మంచి స్పందన వస్తుంది. ఇక రాములు నాయక్ ప్రచారం కూడా గిరిజన గ్రామాలలో విస్తృతంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తమ గిరిజనుడికి టికెట్ ఇవ్వడం పై గిరిజనులలో చర్చ జరుగుతుంది.
బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరుపున బండి సంజయ్ ప్రచారం నిర్వాయిస్తున్నారు.ఆయన రెండు సార్లు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. కేంద్ర శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా పర్యటించారు. బీజేపీ మొన్నటి వరకు కొంత ఓటర్లు మొగ్గు చూపుతున్నారని అనుకున్నా కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న విధానాలు , వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత కనిపిస్తుంది. అంతుకు ముందు ఉన్న ప్రభావం కనిపించటంలేదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండటం తప్ప దానికి ఉన్న ఆవకాశాలు పెద్దగా కనిపించటంలేదు.
వామపక్షాల అభ్యర్థిగా జయసారధి రెడ్డి పోటీలో ఉన్నారు. ఖమ్మం ,నల్లగొండ, వరంగల్ జిల్లాలో లెఫ్ట్ ప్రభావం ఎక్కువగా ఉండటం ఆయనకు కలిసొస్తుందని అనుకున్నా ,గతంలో లాగా వామపక్షాలు తమ సత్తా చాటలేక పోతున్నాయి. అంతే కాకుండా కొన్ని ప్రాంతాలలో మాత్రమే ప్రచారం ఉదృతంగా సాగుతుంది. లెఫ్ట్ ఓట్లు గంపగుత్తగా ఆయనకు వస్తాయా అంటే అనుమానమే అంటున్నారు విశ్లేషకులు . జయసారధి రెడ్డి తరుపున సిపిఎం ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి లు పర్యటించారు. జాయింట్ మీటింగ్ లలో పాల్గొన్నారు. లెఫ్ట్ పార్టీలు బలపరిచిన జయసారధి రెడ్డిని గెలిపించాలని కోరారు.మాజీ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ , సిపిఐ,సిపిఎం జిల్లా కార్యదర్శులు పోటు ప్రసాద్ , నున్నా నాగేశ్వరరావు లు ప్రచారంలో పాల్గొంటున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలంగా వ్యవహరించిన జె ఏ సి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పోటీలో ఉండటం తో కొత్త చర్చ జరుగుతుంది. ఆయనకు సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచింది. విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఆయన పట్ల ఉద్యోగుల్లో , నిరుద్యోగుల్లో కొంత పాజిటివ్ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఉద్యమకారులు చీలిపోవటం ,మైనస్ గా మారింది . డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రచారం ఉద్యమ సమయంలో ఎలా జరిగిందో అదే విధంగా జరుగుతుంది. ఆయనకు బీసీ లు ఇతర ఎస్సీ , ఎస్టీ ,వర్గాలు మద్దతునిస్తున్నాయి. అన్ని జిల్లాలో ఆయనకు ఉన్న పరిచయాలు ఉపయోగిస్తున్నారు. ఇవి ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి
ఇక తీన్మార్ మల్లన్న , రాణి రుద్రమ , లతో పాటు మొత్తం 71 మంది అభ్యర్థులు రంగంలో ఉండి బ్యాలట్ పేపర్ చాల పెద్దదిగా ఉంటుంది. అందువల్ల పోలింగ్ ఏవిధంగా జరుగుతుంది. అనేది చూడాలి . ఓటర్లు కూడా పార్లమెంట్ నియోజకర్గంలో లాగానే 4 లక్షల 91 వేల మంది ఉన్నారు. దాదాపు 6 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఏర్పడిన 12 జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సివుంది. ఈ నెల 14 వతేదీన ఎన్నిక జరుగుతుంది. 12 న ప్రచారం ముగియ నున్నది . అభ్యర్థి గెలవాలంటే పోలైన ఓట్లలో 51 శాతం వచ్చిన అభ్యర్థి ని విజేతగా ప్రకటిస్తారు. అందువల్ల ఈ ఎన్నిక గెలుపోటములపై ఉత్కంఠత నెలకొన్నది . అందువల్ల అభ్యర్థులు ప్రచారాన్ని ఉదృతం చేశారు.

Related posts

తెలంగాణ లో టీడీపీ కీం కర్తవ్యం…అధ్యక్షుడా ?సమన్వయ కమిటీ నా ??

Drukpadam

వీరతెలంగాణ పోరాటం వక్రీకరణకు బీజేపీ యత్నం:తమ్మినేని

Drukpadam

మార్చి 10న ఢిల్లీలో ధర్నాకు ఎమ్మెల్సీ కవిత పిలుపు…!

Drukpadam

Leave a Comment