Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

శర్వానంద్ మాకు మరో రామ్ చరణ్ లాంటివాడు: చిరంజీవి

శర్వానంద్ మాకు మరో రామ్ చరణ్ లాంటివాడు: చిరంజీవి
ఖమ్మంలో శ్రీకారం ప్రీరిలీజ్ ఈవెంట్
ముఖ్య అతిథిగా చిరంజీవి
శర్వానంద్ హీరోగా శ్రీకారం సినిమా

శర్వా నా బిడ్డ అంటూ వాత్సల్యం ప్రదర్శించిన మెగాస్టార్
శర్వానంద్ హీరోగా రూపుదిద్దుకున్న శ్రీకారం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీ ఆవరణలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, శర్వానంద్ ను తమ కుటుంబంలో ఒకడిగానే భావిస్తామని స్పష్టం చేశారు. తమకు రామ్ చరణ్ ఎలాగో, శర్వానంద్ కూడా అంతేనని వివరించారు. శర్వా తమ కుటుంబంలో కలిసిపోతాడని పేర్కొన్నారు. ఓసారి అతడితో కలిసి ఓ యాడ్ లో నటించానని, ఆపై శంకర్ దాదా ఎంబీబీఎస్ లోనూ తనతో శర్వా నటించాడని చిరంజీవి తెలిపారు. ఇక శ్రీకారం చిత్రం గురించి చెబుతూ… నా బిడ్డ శర్వానంద్ కు ఆల్ ది బెస్ట్ అంటూ దీవించారు. శ్రీకారం… వ్యవసాయం అవసరం, గొప్పతనం గురించి వివరించే చిత్రమని అన్నారు. వ్యవసాయం ఆవశ్యకతను అందరికీ వివరించేందుకు సరైన సమయంలో వస్తున్న చిత్రం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర హీరో శర్వానంద్ మాట్లాడుతూ నా బాస్ చిరంజీవి గారి ముందు మాట్లాడటం నాకు భయంగా ఉంది. ఎప్పుడూ ఆయన ముందు మాట్లాడటం లేదు. అందుకే చాలా పాయింట్లు మరిచిపోకుండా నేను రాసిపెట్టుకొన్నాను అని శర్వానంద్ తెలిపారు .నా మొదటి సినిమా శంకర్‌దాదా ఎంబీబీఎస్ నా మొదటి సినిమా శంకర్‌దాదా ఎంబీబీఎస్. నేను చూసిన మొదటి విజయం ఆ సినిమానే. ఆ చిత్రంలో నాకు వేషం ఇచ్చి నా కెరీర్‌కు , నా విజయానికి శ్రీకారం చుట్టింది మెగాస్టార్ చిరంజీవి. నా శ్రీకారం సినిమా ఫంక్షన్‌కు రావడానికి ఒప్పుకోవడంతోనే ఈ మూవీ సక్సెస్ అయిందని భావిస్తున్నాను.నీ సంకల్పం గొప్పదైతే.. నీ తలరాత మారుస్తుంది శ్రీకారం ఫంక్షన్ సందర్భంగా గతంలో చిరంజీవి నాకు చెప్పిన ఓ మాట చెప్పారు. నీ సంకల్పం గొప్పదైతే అదే నీ తలరాతను మారుస్తుంది అని చిరంజీవి చెప్పిన ఎప్పుడూ నా గుండెలో ఉంటుంది. థ్యాంక్స్ సార్. మీరు గొప్ప మాటలను చెప్పినందుకు థ్యాంక్స్. వాటిని ప్రతీ రోజు షూటింగుకు వెళ్లే ముందు ఆ మాటలను తలచుకొంటాను అని అన్నారు. ఆ సంకల్పమే మీ ముందు నిలబడేలా చేసింది. మీ మాటల వల్లే అది సాధ్యమైంది అంటూ శర్వానంద్ అన్నారు.
తిరుమల కిశోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మార్చి 11న శివరాత్రి సందర్భంగా రిలీజ్ అవుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ,సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

సరిహద్దుల్లో ఏపీ అంబులెన్సుల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు సీరియస్.. ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే!

Drukpadam

Drukpadam

ఎట్టకేలకు వెనక్కి తగ్గిన శ్రావణ భార్గవి!

Drukpadam

Leave a Comment