Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చెరుకు సుధాకర్ గెలుపు-నూతన రాజకీయాలకు మలుపు………. మందా కృష్ణమాదిగ

ఖమ్మంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ

డాక్టర్ చెరుకు సుధాకర్ గెలుపునూతన రాజకీయాలకు మలుపు……….
సామాజిక శక్తుల పునరేకీకరణతోనే బహుజన రాజ్యం మలిదశ తెలంగాణ వీరోచిత పోరాటంలో ఉద్యమ సేనానిగా వ్యవహారించిన డాక్టర్ చెరుకు సుధాకర్ గెలుపుతోనే రాష్ట్రంలో నూతన రాజకీయాలకు మలుపు తిరుగుతుందని, అదేవిధంగా సామాజిక శక్తుల పునరేకీకరణతోనే బహుజన రాజ్యం సాధ్యమవుతుందని ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ అన్నారు. స్థానిక కావేరి హోటల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నో దశాబ్దాలపాటు అనేక ఆకాంక్షలు, ఆశలు, ఆశయాలు, కోరికలతో సాగిన తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ చెరుకు సుధాకర్ మహత్తరమైన పాత్రను పోషించాలని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులు చేసిన త్యాగాలు, ఉద్యమంలో కీలక పాత్రను పోషించటమే కాకుండా అనేక నిర్బంధాలు, జైలుశిక్ష సైతం అనుభవించిన వారిని మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. కాగా, మలిదశ తెలంగాణ ఉద్యమo సందర్భంగా ఏడాదిపాటు, జైలులో నిర్బంధించబడికూడా, మిలిటెంట్ పాత్రను పోషించడం ఆయన ఒక్కడికే చెల్లింది అన్నారు. నిజమైన తెలంగాణవాది డాక్టర్ చెరుకు సుధాకర్ ని ఆయనను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ చరిత్ర డాక్టర్ చెరుకు సుధాకర్ యొక్క త్యాగాన్ని, గొప్పతనాన్ని, నిబద్ధతకు సాక్ష్యం ఇస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు దొరలపాలనకు, బహుజనుల అస్తిత్వానికి మధ్య పోటీగా అభివర్ణించారు. దొరల పాలనకు మాత్రమే కాకుండా, దొరల ప్రతినిధులను కూడా ఓడించాలని పిలుపునిచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది అమరులను స్మరిస్తూ, గౌరవిస్తున్న తీరుగానే 69 ఉద్యమకారులను కూడా మనం ఏవిధంగా చూస్తున్నామో అదే విధంగా, డాక్టర్ చెరుకు సుధాకర్ కు సముచితమైన రీతిలో గౌరవప్రదంగా చూసుకోవాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. నిజమైన పోరాటయోధుడు, బహుజన నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఎమ్మెల్సీగా గెలుపు సాధించడం , రాష్ట్రంలోని సామాజిక శక్తుల పునరేకీకరణ నేపథ్యంలో బహుజన రాజ్యం సిద్ధిస్తుందన్నారు. సామాజికశక్తులు అప్రమత్తంగా లేకపోవడంచేతనే, రాష్ట్రంలో ఆధిపత్య కులాల ఆధిపత్యం సాగుతుందన్నారు. ఈ విషయంపై తాను ముందుగానే హెచ్చరించానని గుర్తుచేశారు. ఇప్పటికైనా ఈ ఎన్నికను దృష్టిలో పెట్టుకొని, సామాజిక శక్తులు ఐక్యమత్యంతో మన బహుజన అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎం ల్ సి అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆధిపత్య కులాల ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో, ఆఖరికి పెద్దల సభపై కూడా వారి ఆధిపత్యం కొనసాగించాలని చూస్తున్నారని విమర్శించారు.‌ సామాజిక పొందికలేని సమాజంలో అశాంతి ప్రబలుతుందని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా పోటీ చేయడం పెద్ద విశేషం ఏమీ కాదని, ముందు భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాల మార్పుకు ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రశ్నించే గొంతుకలుగా అభివర్ణించుకుంటున్న ఆధిపత్య కులాలు, వారే పెద్దల సభలో కూడా బహుజనుల సమస్యలపై ప్రశ్నిస్తున్నారని భావించడం హాస్యాస్పదంగా ఉంటుందన్నారు. సమాజంలో ప్రోటోకాల్ అవసరమని ఆధిపత్యకులాల, ఇతర సామాజిక శక్తుల మధ్య ఇది కొరవడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన గెలుపుతో రాష్ట్రంలో చాలా విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయని తన పోటీకి ఇది శ్రీకారం చుడుతుందన్నారు. మహాజన సోషలిస్టు పార్టీ తనకు మద్దతు ఇవ్వటం జరిగిందని ఈ మద్దతు ప్రకటన వెలువడిన వెంటనే వచ్చిన స్పందన అపూర్వంగా ఉందని తెలిపారు. గ్రామ గ్రామాలలో బిజెపి, సిపిఐ, సిపిఎంలకు పార్టీ కార్యకర్తలు ఉన్నారో, లేరో, చెప్పలేంకానీ మహాజన సోషలిస్టు పార్టీకి ప్రతిచోటా కార్యకర్తల బలం ఉందన్నారు. అడుగడుగునా వీరంతా తనకు మద్దతు పలకడం జరుగుతుందని, రాబోయే మూడు, నాలుగు రోజులు అత్యంత కీలకమైనవని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. బహుజన జేఏసీ చైర్మన్ డాక్టర్ కె.వి.కృష్ణారావు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, కేవలం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు మాత్రమే కాదని, ఈ ఎన్నికలు బహుజనుల ఆత్మగౌరవం, ఆధిపత్యకులాల అహంకారం మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కాకుండా సామాజిక తెలంగాణ ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమం సాగిందని, ముందుగా భౌగోళిక తెలంగాణ అనంతరం సామాజిక తెలంగాణ దిశగా తీర్చిదిద్దుదామనుకుంటే, ఆధిపత్య కులాల ఆధిపత్యం అధికమైందని విమర్శించారు . మనం కోరుకున్న బహుజన రాజ్యం, సామాజిక తెలంగాణ కోసం డాక్టర్ చెరుకు సుధాకర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎఫ్.గోపీనాథ్ మాట్లాడుతూ అధికారపార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఓడించి, ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. దీనికోసం ఉద్యమశక్తులు ముందుకు రావాలని సూచించారు.‌ తెలంగాణ ఇంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చలమారెడ్డి మాట్లాడుతూ దొరలపాలనకు, బహుజనుల పాలనకు మధ్య జరుగుతున్న పోటీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలనీ, బహుజన రాజ్య సాధనకు డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని గెలిపించాలని కోరారు .తొలుత మందకృష్ణ మాదిగ డాక్టర్ చెరుకు సుధాకర్ , డాక్టర్ కె. వి. కృష్ణారావు ల ఆధ్వర్యంలో ,పూలే వర్ధంతి నీ పురస్కరించుకోని , పూ లే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు .అనంతరం ర్యాలీగా బయలుదేరి అమరవీరుల స్థూపం ఎ దు టా అమరవీరులను స్మరించుకుంటూ ,కొద్దిసేపు శ్రద్ధాంజలి ఘటించారు. విలేకర్ల సమావేశంలో తెలంగాణ ఇంటి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బత్తుల సోమయ్య, కల్వకుంట్ల లత, వడ్డెబోయిన వెంకటేశ్వర్లు, వడిత్య రాజేష్, ఇరిగి ఉజ్వల, షేక్ నాగుల్మీరా, మొహమ్మద్ ఖాన్, బైరం వరలక్ష్మి, రాకేష్ మరియు వివిధ ప్రజా, కుల, సామాజిక సంఘాల నాయకులు గుంతెటి వీరభద్రం, లిక్కి కృష్ణారావు, బానోతు బద్రు నాయక్, పెరుగు వెంకటరమణ, జాకబ్, వల్లెపు సోమరాజు, గరిడేపల్లి సత్యనారాయణ, నరేందర్, ఏపూరి వెంకటేశ్వరరావు,తూరుగంటి అంజయ్య, బచ్చలకూర వెంకటేశ్వర్లు, వంగూరి ఆనందరావు, కొట్యనాయక్, చిట్టిమల్లు, ఏపూరి వెంకటేశ్వర్లు, తీగల రాము, పులిపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజన్న బిడ్డ షర్మిలమ్మను ఆశీర్వదించండి

Drukpadam

మావోయిస్టు కీలక నేత హిద్మ ఎన్ కౌంటర్ లో మృతి…

Drukpadam

బ్రిటన్ స్కూళ్లల్లో భారతీయ విద్యార్థులకు వేధింపులు…

Drukpadam

Leave a Comment