Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బెంగాల్ సిఎం పై దాడి

మమతా బెనర్జీపై దాడి.. కోల్ కతాకు పయనం!

దాడి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మమతా బెనర్జీ
  • నందిగ్రామ్ పర్యటనలో మమతపై దాడి
  • నలుగురు వ్యక్తులు దాడి చేశారన్న మమత
  • సెక్యూరిటీ చాలా దారుణంగా ఉందని మండిపాటు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, నందిగ్రామ్ లో ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీఎంసీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన కీలక నేత సువేందు అధికారిపై ఆమె పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో తన నామినేషన్ వేయడానికి ఆమె నందిగ్రామ్ కు వెళ్లారు.

షెడ్యూల్ ప్రకారం కోల్ కతాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగ్రామ్ లోనే ఈ రాత్రికి ఆమె బస చేయాల్సి ఉంది. అయితే దాడి నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకున్న ఆమె కోల్ కతాకు తిరుగుపయనం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పారు. తాను కారు ఎక్కుతుండగా తనను నెట్టేశారని తెలిపారు. ఈ సందర్భంగా గాయపడిన తన కాళ్లను చూపించారు.

గతన పర్యటన సందర్భంగా ఒక్క పోలీసు అధికారి కూడా కనిపించలేదని మండిపడ్డారు. సెక్యూరిటీ చాలా దారుణంగా ఉందని అన్నారు. దాడిలో తన కాళ్లకు గాయాలయ్యాయని చెప్పారు. దాడి వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఈ దాడిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని మమత చెప్పారు. ఒక గుడిలో పూజలు నిర్వహించుకుని వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

Related posts

బెంగాల్ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత!

Drukpadam

బీఆర్‌ఎస్ నేతలపై రెండో రోజూ ఐటీ సోదాలు….

Drukpadam

ఇది మీకు తెలుసా …హై కొలెస్ట్రాల్ కు తొలి సంకేతాలు ఇవే!

Drukpadam

Leave a Comment