Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ తప్పదా …?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ తప్పదా …?
-ఉద్యమాలను సైతం కేంద్రం పట్టించుకోదా?
-రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయబోతుంది
-ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రవేటీకరణ ఆగుతుందా ?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ తప్పదా అంటే కేంద్రం మాటలు వింటే తప్పదనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఉక్కు ప్రరిస్తామ రక్షణకోసం జరుగుతున్నా ఉద్యమాలను సైతం కేంద్రం పట్టించుకొనే పరిస్థిలో లేదు. ఎంపీ లు రాజీనామాలు చేయాలనే డిమాండ్ ను తెలుగు దేశం ముందుకు తెస్తుంది. దీనిపై రాష్ట్ర పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. విశాఖ ఉక్కు ప్రవేటీకరణ ఆగుతుందంటే ఉద్యమాలు చేయటానికి తాము సిద్ధమేనని ప్రకటించారు. ఎన్నో ఉద్యమాలు ,32 మంది ప్రాణ త్యాగం ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ లో 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నష్టాలు వస్తున్నాయనే పేరుతొ స్టీల్ ప్లాంట్ ను ప్రవేట్ వాళ్లకు అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే దానికి సంబందించిన ప్రక్రియను ప్రారంభించింది. దీనితో ఆంధ్రా ముంబై గా పిలవబడే విశాఖ వన్నె తగ్గునున్నదా అంటే అవుననే అంటున్నారు స్థానికులు . ఒక్క కరిమికులే కాకుండా ఆంధ్రా రాష్ట్రము అంత ఆందోళన వ్యక్తం అవుతుంది. సహజసిద్ధమైన పోర్ట్ కలిగి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన స్టీల్ ను ఉత్పత్తి చేసే పరిశ్రమగా విశాఖ స్టీల్ కు పేరుంది. 26 వేల ఎకరాల భూములు కలిగి స్టీల్ సిటీగా పేరున్న విశాఖ కు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారనున్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ , కేంద్రపరిశ్రమల మంత్రి ఇప్పటికే దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పరిశ్రమలో ఎలాంటి ఇక్యూటి షేర్లు లేవని ప్రకటించి సంచలనం రేపారు. కేంద్రం ఈ పరిశ్రమ ఏర్పాటుకు సుమారు 4 వేల రూపాయలు ఖర్చుచేసింది. దీని ద్వారా 39 వేల కోట్ల రూపాయలు పన్నుల ద్వారా పొందింది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విలువ 3 లక్షల 20 వేల కోట్లు ఉంటుందని అంచనా .దాన్ని కారుచౌకగా అంటే కేవలం 1350 కోట్లకు అమ్మెందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అప్పులు కేవలం 18 వేల కోట్లు మాత్రమే .కరోనా సందర్భంగా ఆత్మ నిర్బర్ పేరుతొ కార్పొరేట్లకు అప్పులు మాఫీచేసిన కేంద్రం విశాఖలో 30 వేలమంది కార్మికులు పనిచేస్తున్న స్టీల్ ఫ్యాక్టరీ కి ఉన్న 18 వేల కోట్లు మాఫీ చేయలేరా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థిలోను విశాఖ స్టీల్ ను ప్రవేటీకరణ కనివ్వ బోమని అంటుంది. దీనికోసం ఆపార్టీకి చెందిన పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విశాఖలో పాదయాత్ర కూడా నిర్వయించారు . ప్రధాని నరేంద్ర మోడీ నష్టాల్లో ఉన్న ఉన్న పరిశ్రమలను ప్రవేటీకరిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న బీజేపీ ,దాని మిత్రపక్షం జనసేన ల నుంచి సౌండ్ రావటంలేదు .పైకి మేకపోతు గంబిర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పైగా విశాఖ స్టీల్ ను ప్రవేటీకరిస్తామని ఎవరు చెప్పారని కూడా కొందరు బీజేపీ నేతలు చెప్పటం కొసమెరుపు . ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం , సిపిఐ,సిపిఎం,ఇతర పార్టీలు దీనిపై పరిరక్షణ పేరుతొ ఉద్యమాలు నడుపుతున్నాయి. పోస్కో ప్రతినిధులతో ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపారని ,దీని పోస్కో కు అప్పగించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటీవల విశాఖ పర్యటన చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నాయకులూ కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. పోస్కో ప్రతినిధులు తనను కలిసిన మాట నిజమేనని అయితే వారు కలిసింది విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాదని దుగ్గిరాజపట్నంలో ,లేదా ,కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని తాను వారిని కోరానని అన్నారు. చంద్రబాబు, అచ్చం నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేస్తున్నారని అక్కడ భూములు కొట్టేయబోతున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పై రాజకీయ మైలేజ్ కోసం జరుగుతున్నా ప్రకటనల యుద్దాన్ని విశాఖ వాసులు గమనిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలు విశాఖ స్టీల్ ప్రవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇటీవల పరిరక్షణ సమితి పిలుపు మేరకు రాష్ట్ర బంద్ జరిగింది. ఈ బందు కు అధికార వైసీపీ తో సహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణాలో సైతం ఉదయ్మలు జరుగుతున్నాయి . విశాఖ స్టీల్ కు అవసరమైన డోలమైట్ ఖనిజం లభించే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం లో కార్మికులు దీక్షలు చేపట్టారు.కేంద్రం మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తిలేదని అంటుంది . ఏమి జరుగుతుందో చూద్దాం…???

Related posts

పెరు బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి!

Drukpadam

తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు!

Drukpadam

ఐటీ రిటర్నుల దాఖలు గడువును పెంచిన కేంద్రం!

Drukpadam

Leave a Comment