Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాత బస్టాండ్ పై అసెంబ్లీ లో నిలదీస్తా -సీఎల్పీ నేత భట్టి

సీఎల్పీ నేత భట్టితో ఖమ్మం బస్టాండ్ పరిరక్షణ కమిటీ

అసెంబ్లీలో పాత బస్టాండ్ చర్చ పెడతా…
ఎన్నికల అనంతరం ఉదృతం కానున్న ఉద్యమం…
ఖమ్మం పాత బస్టాండ్ ను లోకల్ బస్టాండ్ గా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
ఈరోజు రాత్రి కాంగ్రెస్ కార్యాలయంలో భట్టితో పాత బస్టాండ్ పరిరక్షణ కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాల దృష్ట్యా పాత బస్టాండ్ ను లోకల్ బస్టాండ్ గా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు పూర్తిగా అందుబాటులో పాత బస్టాండ్ వుంది అని తెలిపారు. బస్టాండ్ పోరాటంలో ముందు వుండే అఖిల పక్షం నేతలపై టీఆర్ యస్ ప్రభుత్వంకక్ష్య కట్టి బైండ్ ఓవర్ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. ఈ విషయాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తమని అయిన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం పాత బస్టాండ్ లోకల్ బస్టాండ్ గా కొనసాగించాలని ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పాత బస్టాండ్ పరిరక్షణ కమిటీ నేతలు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో నేతలు యర్రా శ్రీకాంత్, జావిద్,
అఫ్రోజ్ సమీనా, వై విక్రమ్, మీరా సాహిబ్, లింగయ్య , ఖయ్యాం తదితరులు పాల్గొన్నారు

Related posts

భానుడి భగభగలు …నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

Drukpadam

ఆర్టీసీ చార్జీల పెంపు…నేరంనాదికాదు కేంద్రానిది అంటున్న రాష్ట్రం..

Drukpadam

ఈడీ దాడుల త‌ర్వాత‌…చైనా పారిపోయిన వివో డైరెక్ట‌ర్లు!

Drukpadam

Leave a Comment