Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం
-75 మున్సిపాలిటీలలో 73 కార్పొరేషన్ లు దాదాపు అన్ని కైవశం
-అన్నిటిని గెలుస్తామంటున్న వైకాపా
-చంద్రబాబు ఇప్పటికైనా బుద్దితెచ్చుకోవాలి
-జగన్ పాలనకు ప్రజలు బ్రమ్మరథం పట్టారు
మూడు రాజధానులు ప్రజలు ఆమోదముద్ర
-భయ పెట్టి బెదిరించి గెలిచారు …టీడీపీ
-జగన్ పాలనకు ఓటు … మంత్రి పేర్ని నాని
ఏపీ లో హోరాహోరీగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది . దీనితో అనేక ప్రశ్నలకు సమాధానం దొరికిందని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. మూడురాజధానులు , విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేకహోదా లాంటి సమస్యలపై ఏపీ ప్రజలు స్పష్టంగానే ఉన్నారని ఎన్నికలు నిరూపించాయని రాజకీయపండితులు పేర్కొంటున్నారు. అనంతపురంనుంచి ఆముదాలవలస వరకు ప్రజలు వైసీపీ కి బ్రహ్మరథం పట్టారు . ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కోర్ట్ స్టే విధించటం తో ఆగిపోయింది . ఇక్కడ ,అక్కడ అనకుండా అన్ని జిల్లాలో ,అన్ని మున్సిపాలిటీలలో కార్పొరేషన్ లలో వైకాపా ఘనవిజయాలు సాధించటంతో వైకాపా కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎలాంటి విజయాలు నమోదు కాలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒక్క తాడిపత్రి ,మైదుకూరు లలో మాత్రం వైకాపా కొంత వెనక పడింది. మూడు రాజధానుల విషయం పై పెద్ద ఎత్తున ప్రచారం చేసిన చంద్రబాబు విజయవాడలో వైసీపీ గెలిస్తే ఇక్కడ రాజధాని లేకుండా చేస్తారని ప్రచారం చేసినా మూడురాజధానులకే ప్రజలు పట్టం కట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్దితెచ్చుకోవాలని వైసీపీ నేతలు పేర్కొన్నారు. పుత్రుడు, దత్తపుత్రుడు ఎన్నిప్రచారాలు చేసినా ప్రజలు నమ్మలేదని మంత్రి కన్నబాబు అన్నారు. మాకు ప్రజలు ఇచ్చిన తీర్పును గర్వంగా కాకుండా ,మరింత భాద్యతగా స్వీకరిస్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి అన్నారు. బీజేపీ ప్రజల తీర్పును స్వాగతిస్తామని అన్నది . ప్రతిపక్షం ఎవరు అనేది ప్రజలు ఎంచుకోలేక పోతున్నారని బీజేపీ పేర్కొన్నది .
కడప జిల్లా మైదుకూరు , అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపాకు కొంత ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని సీట్లు తక్కువవచ్చినప్పటికీ అక్కడ కూడా వైకాపా నే మున్సిపాల్టీ లను కైవశం చేసుకుంటుందని నేతలు పేర్కొంటున్నారు. మైదుకూరులో మొత్తం 24 వార్డులు ఉండగా టీడీపీ కి 12 వార్డులు , వైకాపాకు 11 వార్డులు దక్కాయి. ఒక వార్డులో జనసేన విజయం సాధించింది. దీనితో జనసేన తరుపున గెలిచినా అభ్యర్థి కీలకంగా మారారు . అక్కడకూడా లోకల్ ఎమ్మెల్యే , ఎంపీల ఎక్స్ ఆఫీసుయో సభ్యులతో మైదుకూరు తమఖాతాలోకే వస్తుందని అంటున్నారు. తాడిపత్రిలో మాత్రం జె సి బ్రదర్స్ తమ పట్టు ఉందని నిరూపించుకున్నారు. మొత్తం 36 వార్డుగాలు ఉండగా టీడీపీ 18 వార్డులలో విజయం సాధించింది. వైకాపా 16 వార్డులను మాత్రమే నిలబెట్టుకుంది. టీడీపీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు . అందువల్ల అక్కడ చైర్మన్ పీఠం దక్కించుకోవటం కోసం వైకాపా కష్టపడాల్సి ఉంటుంది. అయితే అక్కడ వైకాపా ఎలాంటి వ్యూహాలు అవలంభిస్తుందనే అనే దానిపై ఇప్పుడు ఆశక్తి నెలకొన్నది .

———————-—/////////—————-
అధికార దుర్వినియోగం తోనే విజయాలు…వర్ల

జగన్ పాలనకు ప్రజలు పట్టం కట్టారు-మంత్రి పేర్నినాని

————-/////———–//////—————–/
ఇది కేవలం జగన్ మాయ , జగన్ పాలనకు ప్రజలు పట్టం కట్టారు. ప్రజలకు పని కావాలి కానీ సొల్లు కబుర్లు కాదని నిరూపించారని అన్నారు. రాజకీయ నాయకులతో అవసరం లేకుండా సచివాలయ వ్యవస్థతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. చెప్పిన మాట అమలు చేసే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్దితెచ్చుకోవాలని అన్నారు.
టీడీపీ కి చెందిన వర్ల రామయ్య మాట్లాడుతూ అధికార యంత్రాగాన్ని , వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి విజయాలు సాధించిందని ధ్వజమెత్తారు . తమకు ఓటు వేయకపోతే పెన్షన్షన్ లు ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఉండవని బెదిరించారని ఆరోపించారు. ఇక తమ తఢాకా చూపిస్తామని తమ కార్యకర్తలు ఇప్పుడు కసితో పని చేస్తారని అన్నారు. ఇది ఒకరకంగా తమ మంచికే జరిగిందని వర్ల అభిప్రాయపడ్డారు.

—————————————–///////———///////—-
వైకాపా విజయాలు వలంటీర్ల కు , డీజీపీ గౌతమ్ సవాంగ్ కు అంకితం … ఆసమ్మతి ఎంపీ రఘురాం కృషంరాజు

———————/-/——-/—————————–
మాపార్టీ ఘనవిజయాలు వెనకాల వలంటీర్లు, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నారని అందువల్ల వారికీ విజయాలు అంకితం ఇస్తున్నానని ఆసమ్మతి ఎంపీ రఘురాం కృషంరాజు వ్యంగ్య అస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి వ్యూహ చతురత మెచ్చుకోవాల్సిందే అని అన్నారు. విశాఖ విజయంలో సాయిరెడ్డి కీరోల్ ప్రదర్శించారని అన్నారు.

 

Related posts

చంద్రబాబు దీక్షలో జగన్ పై అగ్గిమీద గుగ్గిలం …

Drukpadam

జ్వరం బారిన పడ్డారన్న ప్రచారంపై ఘాటు రిప్లై ఇచ్చేసిన రాజగోపాల్ రెడ్డి!

Drukpadam

టీడీపీ నేత‌ల ప‌రుష ప‌దజాలంపై రాష్ట్ర‌ప‌తికి వైసీపీ ఎంపీల బృందం ఫిర్యాదు

Drukpadam

Leave a Comment