కాంగ్రెస్ కు కొండా విశ్వేశ్వర రెడ్డి గుడ్ బై …?

కాంగ్రెస్ కు కొండా విశ్వేశ్వర రెడ్డి గుడ్ బై …?
-బీజేపీ లో చేరికకు రంగం సిద్ధం
-ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తరువాత మరిన్ని చేరికలు బీజేపీ స్కెచ్
-తీవ్ర ప్రయత్నాలలో బీజేపీ నేతలు
తెలంగాణాలో బీజేపీ ఆకర్ష్ పథకానికి మరో సారి పదును పెడుతున్నది.ఇటీవల కాలంలో కొంత బీజేపీ చేరికల్లో వెనక పట్టు పట్టినా దానిపై తిరిగి దృష్టి సారించింది . అందులో భాగంగానే కాంగ్రెస్ కు చెందిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆయన త్వరలో కాంగ్రెస్ ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతుంది . గతంలోనే ఆయన కాంగ్రెస్ పై తన అసమ్మతిని పలుమార్లు వెల్లడించారు. ఆయన 2014 లోకసభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు టీఆర్ యస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.చేవెళ్ల నుంచి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగి చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తరువాత కాలంలో కాంగ్రెస్ లో ఆక్టివ్ గా ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో నెలకొన్న వర్గ విభేదాలు , గ్రూపులు పార్టీ రోజురోజుకు బలహీన పడటంతో తాను అనుకున్న విధంగా టీఆర్ యస్ పై పోరాడలేనని భావించిన విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమైయ్యారని సమాచారం .

Leave a Reply

%d bloggers like this: