పవన్ కళ్యాణ్ రూటే సపరేటు…

పవన్ కళ్యాణ్ రూటే సపరేటు…
-బీజేపీ తో మిత్రపక్షం అంటూనే టీఆర్ యస్ కు మద్దతు
-ఆంధ్రలో బీజేపీ తెలంగాణాలో టీఆర్ యస్
-ఇదేమి మిత్రధర్మం అంటున్న బీజేపీ
-ఆయనకు ఏమైనా ఇబ్బందులు ఉంటె చెప్పుచు అన్న బండి సంజయ్
-బీజేపీ తో కలిసి సాగడం పై అనుమానాలు
పవన్ కళ్యాణ్ ఆంధ్ర లో బీజేపీతో మిత్రపక్షం గా ఉంటూనే తెలంగాణాలో కూడా బీజేపీతో స్నేహం చేస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ యస్ కు మద్దతు ప్రకటించటం పై బీజేపీ మండిపడుతుంది. పవన్ రాజకీయాలపై బీజేపీ నాయకులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో మిత్ర ధర్మాన్ని పాటించకపోవడం పై అనేక రకాల ఊహాగానాలకు తెరలేచింది.

అసలు పవన్ నైజం పై ఆశక్తి కర చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ రూటే సపరేటు అంటున్నారు పరిశీలకులు . సినీ యాక్టర్ కం రాజకీయనాయకుడు అయిన జనసేన పార్టీ అధినేత … ఇప్పటి వరకు రాష్ట్ర కమిటీ ని ఏర్పాటు చేయకుండానే అన్నితానై పార్టీ ని నడిపిస్తున్నారు… బడుగు బలహీన వర్గాల కోసం పరితపించే నాయకుడు వచ్చాడని కొంతమంది ఆయన వెంట నడిచారు . తరువాత అనేక మంది ఆయనకు దూరం అయ్యారు. అది వేరే సంగతి అనుకోండి.జనసేన అంటే జనంకోసం పని చేసే సైన్యం అనుకుని ఆయన వెంట పరుగులు తీసిన యువకులు ఆలోచనలో పడ్డారు. మొదట ఆయన ప్రగతిశీల ఆశయాలతో ముందుకు నడిచే భారత్ చేగువేరా గా బాహించారు .అందుకు తగ్గట్లుగానే ఆయన కమ్యూనిస్టులతో కలిసి నడిచారు . 2019 ఎన్నికలలో వారితో కలిసి ఎన్నికల రంగంలో దిగారు. అంటే కాకుండా బి యస్ పి అధినేత్రి మాయావతిని కలిసి ఆమె పార్టీతో స్నేహం చేశారు.అదికూడా అప్పటి మిత్ర పక్షంగా ఉన్న కమ్యూనిస్ట్ లను సైతం సంప్రదించకుండానే ఢిల్లీ వెళ్లి మాయావతిని కలిశారు.దీనిపై కమ్యూనిస్టులకు కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఎన్నికల మధ్యలో ఆయనతో తెగ తెంపులు సరికాదని సరిపెట్టుకున్నారు.చేగువేరా ఆదర్శం అనటంతో ఈయన లో కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయనుకున్నారు.ఎన్నికల్లో పవన్ పార్టీ సతికిల పడటంతో కమ్యూనిస్టులకు దూరం అయ్యారు. ఎన్నికలకు ముందు టీడీపీ కనుసైగలతో ప్రత్యేకంగా చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఆయన వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. కేవలం వైసీపీ అందునా జగన్ మోహన్ రెడ్డి పై ఆయన ప్రత్యేకమైన వ్యతిరేకత పెంచుకుని ఆయన పై విమర్శలతో ఎన్నికలలో రాష్ట్రమంతా తిరిగారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని వదిలి ప్రతిపక్షం పై విమర్శలు చేయడం పై ప్రజలలో ఆయన వ్యవహార శైలిపై అనుమానాలు వెల్లువెత్తాయి. అందుకే ఆయన పార్టీని అంతగా నమ్మలేదనే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి . 2014 లో సైతం ఆయన బీజేపీ తెలుగుదేశం పార్టీల గెలుపు కోసం రాష్ట్రం అంతా పర్యటించారు. మోడీతో పాటు సభలలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా అన్నారు. రాష్ట్రానికి నిధులు , రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు . వాటి అన్నిటికి పవన్ కళ్యాణ్ సైతం చప్పట్లు కొట్టారు. జనసైనికులు అందరు జై బీజేపీ ,జై తెలుగుదేశం అన్నారు.అటు కేంద్రం లో బీజేపీ ,ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాయి.కానీ మోడీ తిరుపతి సభలో వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానంగా నిలిచిన ప్రత్యేక హోదా అటుకెక్కేంది. రాజధానికి నిర్మాణానికి నిధులు అన్నారు. అమరావతిలో రాజధాని శంకుస్థాపన సభకు వచ్చిన ప్రధాని మోడీ నీళ్లు ,మట్టి తెచ్చి ఇచ్చారు. దీనిపై ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీ పై కేంద్రం పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పాచి లడ్డు, తట్టెడు మట్టి ఇచ్చారని ధ్వజమెత్తారు . పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలలో ఏఒక్క దాన్ని కేంద్రం ప్రభుత్వం అడ్రస్ చేయలేదు. ఎన్నికల తరువాత తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది . రాష్టంలో పవన్ కళ్యాణ్ ఆయన పోటీచేసిన రెండు సీట్లలో ఓడిపోయి చతికిల పడ్డారు. వామపక్షాలకు గుడ్బై చెప్పారు. కేంద్రంలోని బీజేపీ పై గాలిమళ్లింది. ఎవరితో జతకట్టాలి అనేది పూర్తిగా ఆయన ఇష్టం . ఇందులో తప్పు పట్టాల్సిన పని లేదు. అయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు , ప్రత్యేక హోదా విషయం లో బీజేపీ తో ఎలాంటి హామీ లేకుండా తిరిగి వారితో స్నేహం చేయటంపై ప్రజలలో ప్రత్యేకించి పార్టీ శ్రేణులలో సైతం కన్ ప్యూజన్ ఉంది . బీజేపీ మిత్రపక్షంగా ఆంధ్రాలో ఉండగా తెలంగాణాలో టీఆర్ యస్ తో జత కట్టడం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి సైతం ఆగ్రహం తెప్పించింది. ఇక్కడ ఒకరకంగా అక్కడ ఒకరకంగా వ్యవహరించటం ఏమిటని ప్రశ్నించారు. ఏమైనా సమస్యలు ఉంటె తనతో చర్చించ వచ్చుకదా అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి .

Leave a Reply

%d bloggers like this: