Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుపతి,సాగర్ ఉపఎన్నికలు ఏప్రిల్ 17

తిరుపతి,సాగర్ ఉపఎన్నికలు ఏప్రిల్ 17
-ప్రకటించిన ఎన్నికల కమిషషన్
-నోటిఫికేషన్ మార్చ్ 23 న
– మార్చ్ 30 వరకు నామినేషన్లు
పోలింగ్ ఏప్రిల్ 17 కౌంటింగ్ మే 2 న
తిరుపతి పార్లమెంట్ కు నాగార్జునసాగర్ ఉపఎన్నకలకు సంబందించిన ఎన్నికల షడ్యూల్ ను కేంద్ర ఎన్నకల సంఘం విడుదల చేసింది. ఏప్రిల్ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఏప్రిల్ 17 ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఎన్నికల నోటిఫికేషన్ ను మార్చ్ 23 విడుదల చేస్తారు . మార్చ్ 30 నామినేషన్లు స్వీకరిస్తారు. 31 స్క్రూటినీ జరుగుతుంది. ఎన్నికల అనంతరం మే 2 వ తేదీన ఐదు రాష్ట్రాల కౌంటింగ్ తో పాటు ఉపఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పటికే రాజకీయపార్టీలు ఈ ఎన్నికల సన్నాహాలలో ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న జిల్లాలకు ఎన్నికల నిభందనలు వర్తించనున్నాయి. తిరుపతి పార్లమెంట్ కు వైకాపాకు చెందిన బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక జరుగుతుండగా ,తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉపఎన్నిక టీఆర్ యస్ కు చెందిన నోముల నరసింహయ్య ఆకస్మిక మృతితో జరుగుతుంది.
తిరుపతి వైకాపా అభ్యర్థిగా గురుమూర్తి
తిరుపతి పార్లమెంట్ కు జరుగుతున్నా ఉపఎన్నికలలో వైకాపా అభ్యర్థిగా మాట్టే గురుమూర్తి ని ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఎప్పుడో పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థిని నిర్ణయించినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ మధ్య కాలంలో అభ్యర్థిని మార్చు తున్నట్లు గుసగుసలు వినిపించాయి. వాటికీ ఫుల్ స్టాప్ పెడుతూ జగన్ ఒకసారి మాటంటే మాటే అనే రీతిలో గురుమూర్తిని ప్రకటించారు.
తెలుగు దేశం తన అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని ప్రకటించిన సంగతి తెలిసిందే .ఇక ఇక్కడనుంచి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీకి చెందిన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
నాగార్జున సాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి
నాగార్జున సాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆయన నియోజకవర్గంలో ఒక సరి ముఖ్య నేతలను సైతం కలిశారు. ఇక టీఆర్ యస్ తన అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ప్రచారాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అభిరుద్ది కార్యక్రమాల పేరుతొ నియోజకవర్గంలో పర్యటించి తమ పార్టీకి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. తెలుగు దేశం , తన అభ్యర్థిని ఇక్కడ రంగంలోకి దించుతుంది.బీజేపీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది . ఇక ఈ రెండు చోట్ల రాజకీయాలు హీటెక్కనున్నాయి .

 

Related posts

Drukpadam

మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో సిపిఎం మెడికల్ క్యాంప్!

Drukpadam

యూపీలోని రాంపూర్ లో రాత్రుళ్లు వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న స్త్రీ!

Drukpadam

Leave a Comment