Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఐడీ నోటీసులపై హైకోర్టులో పిటిషన్ వేయనున్న చంద్రబాబు

సీఐడీ నోటీసులపై రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్న చంద్రబాబు
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు
చంద్రబాబు, నారాయణలకు నోటీసులు
ఈ నెల 23న విచారణకు రావాలని స్పష్టీకరణ
న్యాయ సలహాలు తీసుకున్న చంద్రబాబు
సీఐడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం
అమరావతిలో భూ దందా జరిగిందని, చంద్రబాబు హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చోటుచేసుకుందన్న ఆరోపణలపై నిన్న సీఐడీ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. సీఐడీ నోటీసుల అంశంపై న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న చంద్రబాబు… రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. అమరావతి భూముల అంశంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్ లో కోరనున్నారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదుతో చంద్రబాబు, మాజీమంత్రి నారాయణలకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 41 (ఏ) సీఆర్పీసీతో పాటు ఎఫ్ఐఆర్ ప్రతిని కూడా సీఐడీ పోలీసులు చంద్రబాబు, నారాయణలకు అందజేశారు. చంద్రబాబుపై 120 బీ, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని, లేకపోతే అరెస్టు చేయాల్సి వుంటుందని నోటీసుల్లో స్పష్టం చేశారు.

Related posts

పురుషుడిగా మారాలనుకున్న మహిళా కానిస్టేబుల్.. అనుమతి ఇచ్చిన ప్రభుత్వం…

Drukpadam

అల్లర్లలో పాల్గొంటే సైన్యంలో ఉద్యోగం రాదు: వాయుసేనాధిపతి!

Drukpadam

మాట …మర్మం

Drukpadam

Leave a Comment