Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పట్టభద్రులలో పట్టు ఎవరిదో…

పట్టభద్రులలో పట్టు ఎవరిదో…
-అందరిలోనూ ఉత్కంఠత
-నేడే లెక్కింపు … ఫలితం ఆలస్యం
– ఎక్కువమంది అభ్యర్థులు … బ్యాలట్ పేపర్ కారణం
-బండిల్స్ కట్టడమే ఒక పూట పని
తెలంగాణాలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14 న జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు జరుగుతుంది.నల్లగొండ ,ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ కౌంటింగ్ నల్లగొండలో జరుగుతుంది.ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తీ అయ్యాయి. నల్గొండ కలక్టర్ ఆధ్వరంలో జరగనున్న ఈ కౌంటింగ్ కోసం ఇప్పటికే పోలింగు ఏజెంట్లు నల్లగొండ చేరుకున్నారు. ఫలితం పై అందరిలోనూ ఉత్కంఠత నెలకొన్నది. 5 లక్షల 5 వేల మంది ఓటర్లు ఉండగా 3 లక్షల 71 వేల ఓట్లు పోలైయ్యాయి . 71 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఎన్నిక అయినందున వాటిని కట్టలుగా కట్టటమే ఒక ప్రయాస అందుకు ఒక పూట సమయం తీసుకునే ఆవకాశం ఉంది. అందులో ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయటం అనేది ఉండటం వల్ల వాటిని వేరు చేయటం మొదటి ఇద్దరినీ రంగంలో ఉంచి మిగతా వారిని ఎలిమినేటి చేయటం జరగాల్సి ఉంది. అందువల్ల లెక్కింపుకు చాల సమన్వయం పెట్టె ఆవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత లో అభ్యర్థి గెలవాలంటే పోలైన ఓట్లలో 50 శాతం దాటి ఒక్క ఓటు వచ్చిన ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.లేక పొతే సెకండ్ ,ప్రయారిటీ పరిగణలోనికి తీసుకోని లెక్కిస్తారు. మొదటి ప్రాధ్యాన్యతలో ఎక్కువ వచ్చిన రెండవ ప్రాధాన్యతతో కలుపుకొని మొదటిది ఇది కలసి 50 శాతం దాటే వరకు లెక్కిస్తారు. ప్రధాన పార్టీలైన టీఆర్ యస్ ,కాంగ్రెస్, బీజేపీ లెఫ్ట్ అభ్యర్థులతో పాటు ప్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న , రాణి రుద్రమ లాంటి వారు కూడా ఓట్లను గట్టిగానే పోల్ చేయించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన రాములు నాయక్ చివరి నిమిషంలో పోటీలో దిగిన ఆయన భారీగా ఓట్లు పాలైనట్లు తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ తో పాటు బంజారాలు ఎక్కువగా ఆయన మొగ్గు చూపారు. బీజేపీ అభ్యర్థి ప్రచారం బాగానే జరిగిన ఓట్లు పాలు చేయించుకోవటంలో వైఫల్యాలు ఉన్నాయి. కోదండరాం మొదటి ప్రాధాన్యతలో నిలిస్తే రెండవ ప్రాధాన్యతలో ఆయనకు భారీగా ఓట్లు పడ్డాయి. లెఫ్ట్ అభ్యర్థి జయసారధి రెడ్డి కి ఎన్ని ఓట్లు వస్తాయనేది చూడాల్సిఉంది. చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న లకు కూడా ఓట్లు పోలైయ్యాయి. తీన్మార్ మల్లన్నకు మున్నారు కాపులు దన్నుగా నిలిచారు.చెరుకు సుధాకర్ కు బీసీ ,ఎస్సి ,వర్గాలు అండగా నిలిచాయి.

Related posts

అనుమతులు లేని ప్రాజెక్టులు తక్షణం ఆపండి …కృష్ణా నది యాజమాన్య బోర్డు!

Drukpadam

రూపాయి విలువ ఢమాల్ … డాలర్ కు రూ.78.83కి పతనం!

Drukpadam

మహిళ అండర్‌వేర్‌ను మాస్కుగా ధరించిన ప్రయాణికుడు, తీసేందుకు నిరాకరణ.. విమానం నుంచి దించివేత!

Drukpadam

Leave a Comment