Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు

  • అమరావతి భూముల అంశంలో సీఐడీకి ఫిర్యాదు చేసిన ఆర్కే
  • ఆర్కే ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ
  • చంద్రబాబు, మాజీమంత్రి నారాయణలకు నోటీసులు
  • సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఆర్కేకి కూడా నోటీసులు
  • రేపు ఉదయం 11 గంటలకు హాజరవ్వాలని ఆదేశం
CID issues notices to YCP MLA Alla Ramakrishna Reddy

అమరావతి అసైన్డ్ భూముల అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ… టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు జారీ చేసింది.

తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. సీర్పీసీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని ఎమ్మెల్యేకి స్పష్టం చేశారు.

కాగా ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్ కు ఎవరిపైనా కక్ష సాధించాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. అమరావతి భూముల అంశంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సీఐడీ ముందు హాజరై వివరణ ఇస్తారని వెల్లడించారు.

Related posts

జన జాతరను తలపిస్తున్న భట్టి పాదయాత్ర!

Drukpadam

మైలవరం వైసీపీ నేతలకు మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ …

Drukpadam

ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా పౌరసత్వం మంజూరు చేసిన పుతిన్!

Drukpadam

Leave a Comment