గుంటూరు-కృష్ణా జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత

  • సమీప ప్రత్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై విజయం
  • విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్లు
  • ఉపాధ్యాయ సమస్యల కోసం కృషి చేస్తానన్న కల్పలత
Kalpalatha won guntur krishna teacher MLC seat

గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా కల్పలత విజయం సాధించారు. ఈ స్థానం నుంచి మొత్తం 19 మంది పోటీ చేశారు. 12,554 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిన్న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా చెల్లని ఓట్లను తీసేసిన అనంతరం అభ్యర్థి విజయానికి 6,153 ఓట్లు అవసరమని అధికారులు నిర్ణయించారు. అయితే, తొలి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థికి 50 శాతానికిపైగా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో కల్పలత 6,153 ఓట్లు సాధించిన వెంటనే సమీప అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై ఆమె విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు.

విజయం సాధించిన అనంతరం కల్పలత మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృష్టి చేస్తానని అన్నారు. తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: