Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాలలో ఉపఎన్నికలలో నోటిఫికేషన్ విడుదల

తెలుగు రాష్ట్రాలలో ఉపఎన్నికలలో నోటిఫికేషన్ విడుదల
తిరుపతి పార్లమెంటు,నాగార్జున సాగర్ అసెంబ్లీ కి ఎన్నికలు
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్,ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఉప ఎన్నికలు
ఈ నెల 30 వరకు నామినేషన్లు
31న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణలకు అవకాశం
ఏప్రిల్ 17న పోలింగ్
మే 2న ఓట్ల లెక్కింపు
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో తిరుపతి లోక్ సభ, నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 31న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3న తుదిగడువు. ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.
తిరుపతి పార్లమెంట్ కు వైసీపీ కి చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ,తెలంగాణలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య లు ఆకస్మికంగా మృతి చెందటంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి . తిరుపతి పార్లమెంటు స్థానం బరిలో అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని రంగంలోకి దించగా, టీడీపీ కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిని పోటీకి నిలిపింది. బీజేపీ-జనసేన కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. వైసీపీ పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందడంతో తిరుపతి స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణాలో ఉపఎన్నిక జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా సీనియర్ నేత ,మాజీమంత్రి కుందూరు జానారెడ్డి ని ప్రకటించింది. ఆయన ప్రచారంలో ఉన్నారు. అదే విధంగా తెలుగుదేశం సైతం ఎన్నికల్లో పోటీచేస్తుంది. తన అభ్యర్థిగా రామకృష్ణను ప్రకటించింది. బీజేపీ , అధికార టీఆర్ యస్ లు తమ అభ్యర్థులను ప్రకటించాల్సిఉంది.

Related posts

అమెరికా వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకెళ్లిన తెలుగు యువకుడికి శిక్ష !

Drukpadam

మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు..!

Drukpadam

హైదరాబాద్ ‘జూ’ లో నిజాం కాలంనాటి ఆడ ఏనుగు కన్నుమూత!

Drukpadam

Leave a Comment