Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు చుక్కెదురు -చీఫ్ జస్టిస్ గా ఎన్ .వి రమణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు చుక్కెదురు -చీఫ్ జస్టిస్ గా ఎన్ .వి రమణ
-జగన్ ఫిర్యాదు తోసిపుచ్చిన సుప్రీం కోర్ట్
-భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ పేరు సిఫార్స్ చేసిన సి జె ఐ
-రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన జస్టిస్ బాబ్ డే

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జస్టిస్ రమణ భారత అత్యోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీం చీఫ్ జస్టిస్ బాబ్ డే సిఫార్స్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆయన చేసిన ఫిర్యాదును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఏపీలోని న్యాయ వ్యవస్థను ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

2020 అక్టోబర్ 6న ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు ఇన్ హౌస్ ప్రొసీజర్ ప్రకారం విచారణ జరిపిందని… అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత జగన్ ఫిర్యాదును తోసిపుచ్చడం జరిగిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్ సైటులో ఈరోజు సమాచారాన్ని ఉంచారు. అయితే ఇన్ హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనదని, దీనికి సంబంధించిన విషయాలు బయటకు వెల్లడించతగినవి కాదని ఆ ప్రకటనలో తెలిపారు.
మరోవైపు చీఫ్ జస్టిస్ బాబ్డే వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేఐగా ఎన్వీ రమణను నియమించాలని కేంద్రానికి ఆయన ఈరోజు సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏప్రిల్ 24న సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేస్తారు.

Related posts

ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ… 14 డిమాండ్లతో ప్రతిపాదనలను సమర్పించిన టీడీపీ

Drukpadam

భూతలానికే తలమానికంగా యాదాద్రి ఆలయం…మంత్రి పువ్వాడ అజయ్ కుమార్!

Drukpadam

మేమంతా కలిసిపోయాం… విభేదాలు లేవని మేడంకు చెప్పాను: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Drukpadam

Leave a Comment