Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం నుంచి వచ్చి సోనూసూద్ ను కలిసిన సోనాలి సూద్

సోనాలి సూద్ హైద్రాబాద్ వచ్చి ఆచార్య షూటింగ్ లో ఉన్న సోనూసుద్ ను కలిసింది . సోనాలి సూద్ అంటే ఆయన భార్య కాదండోయ్. ఖమ్మం నుంచి వచ్చిన సోనాలిసూద్ సోనూసూద్ అంటే అభిమానంతో ఈ పేరు తమబిడ్డకు పెట్టుకున్నారు తల్లితండ్రులు ఇది విన్న వెంటనే వారిని కలిశారు సోనూసూద్. ఆయన ఆకుటుంబాన్ని దగ్గరకు తీసుకుని వారితో గడపడం ఆకుటుంబసభ్యులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది . వివరాల్లోకి వెళ్లితే

సినిమాల్లో చేసేది విలన్ పాత్రలే అయినప్పటికీ.. సాయం కోసం తన వద్దకు వచ్చినవారందరికీ అండగా నిలుస్తూ కలియుగ కర్ణుడిగా ముద్ర వేసుకున్నాడు నటుడు సోనూసూద్. ‌కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు. ఎంతో మందికి సాయం చేసి చేర్చి అందరి మన్ననలు పొందాడు. ప్రజల గుండెల్లో ఆరాధ్యదైవంగా మారిపోయాడు. నష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది. సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ని కొనియాడింది. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్‌లో సోనూ సూద్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో సోనూసూద్‌ హైదరాబాద్‌ వచ్చాడని తెలుసుకున్న ఓ కుటుంబం ఆయనను కలవడానికి ఖమ్మం నుంచి సిటీకి వచ్చారు. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ జంట తాజాగా షూటింగ్‌ జరిగే సెట్‌ వద్దకు వెళ్లి రియల్‌ హీరోను కలిశారు. తనను కలవడానికి ఓ ఫ్యామిలీ వచ్చిందని తెలుసుకున్న సోనూసూద్‌ ఆశ్యర్యపోయాడు. అంతేగాక కుటుంబంలోని అయిదు నెలల చిన్నారికి సోనాలి సూద్‌ అని పేరు పెట్టినట్లు హీరోకు ఆ అభిమానులు తెలిపారు. ఇది సోనూసూద్‌ భార్య పేరు. దీంతో సంబరపడిపోయిన నటుడు కుటుంబంతో కాసేపు ముచ్చటించి పాపను ఎత్తుకొని ఆడించాడు. అనంతరం వారితో సెల్ఫీలు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Related posts

జలాంతర్గామిలో చిన్న లోపంతోనే… చనిపోతామని తెలిసేలోపే గాల్లో కలిసిన ప్రాణాలు!

Drukpadam

ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్ వల్లే కు.ని. మరణాలు:గవర్నర్ తమిళిసై!

Drukpadam

హైదరాబాద్ ‘జూ’ లో నిజాం కాలంనాటి ఆడ ఏనుగు కన్నుమూత!

Drukpadam

Leave a Comment