Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పాలేరు మాకు మరో పులివెందుల …షర్మిల

పాలేరు మాకు మరో పులివెందుల …షర్మిల
-అక్కడనుంచే పోటీ నుంచి షర్మిల క్లారిటీ
-వచ్చే నెల 9 న ఖమ్మం లో భారీ బహిరంగసభ
– సభకు ఇంకా అనుమతి ఇవ్వని పోలీసులు
-ఎన్ని అడ్డంకులు ఎదురైనా సభను నిర్వహిస్తానన్న షర్మిల
షర్మిల రాజకీయాలు ఖమ్మం చూట్టు తిరుగుతున్నాయి . ఏప్రిల్ 9 న ఖమ్మం లో భారీబహిరంగసభ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.దీనికి ఇంకా పోలీసులు అనుమతి లభించలేదు. ఖమ్మం జిల్లాలో వైయస్సార్ అభిమానులు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతోనే ఆమె ఖమ్మం జిల్లాను ఎంచుకొన్నట్లు  అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా 2023 లో జరిగే శాసనసభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ఆమె అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.వైయస్ కు పులివెందుల ఎలాగో తనకు పాలేరు అలాంటిదని ఆమె అంటున్నట్లు సమాచారం.2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వైకాపా కు ఖమ్మం పార్లమెంట్ తో పాటు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
దీనితో షర్మిల ఈ జిల్లాపై ఫోకస్ పెట్టారు . అప్పటికి ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చిన నేపథ్యంలో షర్మిల ప్రత్తికి ఎలాంటి ఆదరణ ఉంటుందో ననే ఆశక్తి నెలకొన్నది .
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా వైయస్ షర్మిల వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ పేరును తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ గా నామకరణ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం దగ్గర ఈ పేరుతొ పాటు మరో రెండు పేర్లను వైయస్ పేరు వచ్చేట్లుగా దరఖాస్తు చేశారని తెలుస్తుంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన ఆమె… అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. వచ్చే నెల 9వ తేదీన ఖమ్మంలో నిర్వహించబోతున్న భారీ బహిరంగసభలో తన పార్టీ పేరును ఆమె ప్రకటించనున్నారని ఒక సమాచారం .అయితే రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజైన జులై 8 న ప్రతి పేరు ప్రకటించేందుకు సిద్ధపడుతున్నట్లు మరో ప్రచారం జరుగుతుంది.

మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె సభకు ప్రభుత్వం అనుమతించే అవకాశాలు లేవనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం ఉత్కంఠను లేవనెత్తుతోంది. ఇదిలావుంచితే, ఈ సభకు సంబంధించి ఇప్పటి వరకైతే మైదానానికి అనుమతి వచ్చింది. కానీ, పోలీసు శాఖ నుంచి మాత్రం అనుమతి రాలేదు. ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొన్నది

దీనిపై షర్మిల మాట్లాడుతూ, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను నిర్వహించి తీరుతామని అన్నారు. తమను ఆపే శక్తి ఎవరికీ లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతానని తెలిపారు. తన తండ్రి వైయస్ కు పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగని చెప్పారు.

Related posts

రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న వేసిన కవిత…

Drukpadam

సహజీవనంపై ఇండోనేసియా నిషేధం.. ఉల్లంఘిస్తే జైలుకే!

Drukpadam

ఈటల సందేహాలను నివృత్తి చేసిన నడ్డా …. పార్టీలో చేరికపై క్లారిటీ…

Drukpadam

Leave a Comment