షర్మిల ఖమ్మం సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్…

షర్మిల ఖమ్మం సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్…
– ఏప్రిల్ 9 న జరిగే సభకు లక్షమంది హాజరౌతారని అంచనా
-షరతులతో కూడిన అనుమతులు
-ప్రతి వ్యక్తి శానిటైజర్ కంపల్సరీ
-భౌతిక దూరం పాటించాలి
-అక్కడే పార్టీ పేరు జెండా ,విధివిధానాలు ప్రకటించే ఆవకాశం
తెలంగాణాలో పార్టీ ఏర్పాట్లపై వైయస్ షర్మిల దూకుడు పెంచారు. పార్టీ జెండా,ఎజెండా , ఖరారు కావటంతో వాటి ఆధారంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తొలుత వైయస్సార్ పుట్టున రోజుసందర్భంగా పార్టీ పేరు జెండా ప్రకటించాలని అనుకున్నప్పటికీ అభిమానుల వత్తిడి మేరకు ముందుగానే ఖమ్మం లో జరగనున్న సభలో వాటిని ప్రకటించాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రతి రోజు విరామమెరగక వచ్చిన ముఖ్యులతో మాట్లాడుతూనే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో లోటస్ పాండ్ ఏరియా రద్దీగా మారింది. ఇటీవల అజారుద్దీన్ కుమారుడు, సానియామీర్జా సోదరి షర్మిలను కలవటం చర్చనీయాంశం అయింది. ఏప్రిల్ 9 ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. దానికి పోలిసుల అనుమతి ఎట్టకేలకు లభించటంతో సభ ఏర్పాట్లలో ఆపార్టీ బిజీ,బిజీగా ఉంది. లక్షమందికి పైగా సభకు ప్రజలు హాజరు అవుతారని అంచనా ఉండటంతో అందుకనుగుణగంగా ఏర్పాట్లు చేస్తున్నారు . ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచే కాకుండా చుట్టుపక్కల పాత వరంగల్ , నల్లగొండ జిల్లాల నుంచి అభిమానులు ఈ సభకు హాజరు కానున్నారు. కరోనా మహమ్మారి దృష్ట్యా పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వటంతో నిర్వహకులు అందుకు అనుగుణంగా అభిమానులకు సూచనలు చేసేందుకు సిద్ధమైయ్యారు. సభకు హాజరయ్యేవారు తప్పని సరిగా మాస్క్ ధరించాలి, ప్రతివాళ్ళు శానిటైజర్ వెంట ఉంచుకోవాలి .భౌతిక దూరం విడిగా పాటించాలని షరతుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలోని వైయస్ అభిమానులతో మాట్లాడుతున్న షర్మిల అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారితో చర్చించారు.ప్రభుత్వ కళాశాల మైదానములో జరిగే బహిరంగసభలో పార్టీ పేరు ,జెండా , విధివిధానాలు ప్రకటిస్తారని సమాచారం.సభ ఎజెండాపై షర్మిల సన్నిహితులు అనుచరులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాలు మినహా ఇప్పటికే అన్ని ఉమ్మడి జిల్లాలలోని వైయస్ అభిమానులతో సమావేశాలు జరిగాయి. వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఆయాజిల్లాల ప్రత్యేకతలపై ఆమె అధ్యయనం చేస్తున్నారు. ప్రతి జిల్లా మీటింగ్ ప్రారంభంలో ఆజిల్లాకు చెందిన ప్రముఖమైన ప్రదేశాలు ,లేదా గొప్పతనాన్ని గురించి చెబుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను రాజకీయాలలో తమ ముందు ఉన్న పెద్దకొండ ను ఢీకొనబోతున్నానని తెలుసనీ అయినప్పటికీ రాజన్న రాజ్యం కోసం ప్రజలకోసం ఎంత దూరం వెళ్లేందుకైనా సిద్దమే నన్నారు. మీరందరు నాతో చేతులు కలిపితే మరింత బలంతో మనందరం కలలు గన్న రాజన్న రాజ్యం తెచ్చుకోవటం పెద్ద కష్టం ఏమి కాదన్నారు.
ముస్లింల సమావేశంలో …షర్మిల
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్స్ ఏమైయ్యాయి
వక్ఫ్ భూముల ఆక్రమణలపై ఏమిచర్యలు తీసుకున్నారు.
ముస్లింల సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 77 వేల ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు ఉండగా 57 వేల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు చెప్పారు.వాటిని ప్రభుత్వం ఎందుకు విడిపించటంలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైద్రాబాద్ పాత బస్తీలో అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు.వైయస్ ఆర్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తే 12 శాతం ఇస్తామన్న పెద్ద మనుషులు ఎందుకు ఇవ్వటంలేదన్నారు. ఇది ముస్లింలను మోసం చేయటం కదా అని అన్నారు.రాష్ట్రం లో ఓటు బ్యాంకు రాజకీయాలు దేశంలో గేట్ బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయని ,మతం కులం కాదు పేదల బ్రతుకులు మారాలి . అందుకు రాజన్న బిడ్డగా పోరాటానికి నేను సిద్ధం మనమంతా చేతులు కలుపుదాం అన్నారు.

Leave a Reply

%d bloggers like this: