ఏపీ నూతన ఎస్ఈసీగా నీలం సాహ్నీ

  • ఈ నెల 31తో పదవీ విరమణ చేయనున్న నిమ్మగడ్డ
  • కొత్త ఎస్ఈసీ కోసం ముగ్గురి పేర్లను ప్రతిపాదించిన సర్కారు
  • నీలం సాహ్నీ పేరు ఖరారు చేసిన గవర్నర్
  • వచ్చే నెల 1న ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్న నీలం సాహ్నీ
Neelam Sahni appointed as new SEC to Andhra Pradesh

ఏపీ ఎన్నికల సంఘం నూతన కమిషనర్ గా నీలం సాహ్నీ నియమితులయ్యారు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. కొత్త ఎస్ఈసీ కోసం ఏపీ సర్కారు ముగ్గురి పేర్లను ప్రతిపాదించగా, వారిలో నీలం సాహ్నీ ఒకరు. తాజాగా ఆమె పేరును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఖరారు చేయడంతో ఏపీ కొత్త ఎస్ఈసీ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.

నీలం సాహ్నీ ఏప్రిల్ 1న ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. నీలం సాహ్నీ గత డిసెంబరులో ఏపీ సీఎస్ గా పదవీ విరమణ చేశారు. ఆపై ఆమె సీఎం జగన్ ప్రధాన సలహాదారుగా నియమితులవడం తెలిసిందే.

Leave a Reply

%d bloggers like this: