Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు ఖమ్మం బంద్

ఖమ్మం బస్టాండ్ వద్ద బంద్ లో పాల్లొన్న వివిధ పక్షాలనాయకులు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ లో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా రైతు ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఖమ్మంలో బంద్ పాటించారు.
తెల్లవారుజామునే డిపోవద్దకు చేరి బస్సులను అడ్డుకున్న కార్యకర్తలు

ఈసందర్భంగా జరిగిన సభలో వివిధపక్షాల నాయకులు సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు

మోడీ ఇకనైనా సాగు చట్టాలను రద్దుచేయండి : బాగం

మీరు మారకుంటే ప్రజలే మారుస్తారు : పోతినేని,

రద్దెసరైన ప్రత్యామ్నాయం : రాయల

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 120 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యమం చేస్తుంటే మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం దారుమని ధ్వజమెత్తారు. ఎవరికీ మేలు చేస్తామని కేంద్రం చెబుతుందో వారే మాకు ఈ చట్టాలు వద్దని అంటుంటే ఎందుకు రద్దుచేయటంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా చట్టాలను రద్దుచేసి రైతుల పక్షాన తాము ఉన్నామని నిరూపించుకోవాలని లేకపోతె రైతులే మోడీ ప్రభుత్వానికి సమాధి కడతారని హెచ్చరించారు.
రైతులు చట్టాలను రద్దు చేయాలనీ పోరాడుతుంటే వారికీ మద్దతుగా ఎవరున్నారు. కేవలం రెండుమూడు రాష్ట్రాలు మాత్రమే అన్న మోడీకి ఈ బంద్ ఒక గుణపాఠం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. దేశం మొత్తం రైతులకు అనేక రూపాలలో సంఘీభావం తెలిపిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు.

నూతన వ్యవసాయ చట్టాల రద్దుమినహా మరో ప్రత్యామ్నాయం లేదని సి.పి.ఐ ఎం.ఎల్.న్యూడెమోక్రైసీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ తెలిపారు. రైతులు సాగిస్తున్న పోరాటం ప్రజలకోసం దేశం కోసం జరుగుతున్న ప్రజాస్వామిక పోరాటమని, ఈ పోరాటాన్ని నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రైవేటీకరణను వేగిరంచేసిన మోడీ వ్యవసాయ రంగాన్ని కూడా కార్పోరేట్ శక్తులకు అప్పగించేందుకు జరుగుతున్న కుట్రలో బాగమే నూతన వ్యవసాయ సంస్కరణ చట్టాలని ఆయన తెలిపారు

ఈసభలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, టీడీపీ నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించగా కార్యక్రమంలో సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సి.ఐ.టి.యు. రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎన్.సాయిబాబా, సి.పి.ఎం. జిల్లాకార్యదర్శి నూన్నా నాగేశ్వరరావు, నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, యర్రా శ్రీను, వై. విక్రమ్, కల్యాణం వెంకటేశ్వరావు,మాదినేని రమేష్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, కె.రామయ్య, శిరోమణి, కాంగ్రెస్ నాయకులు బాలగంగాదర్ తిలక్, నాగెండ్ల దీపక్ చౌదరి, కొత్త సీతారాములు, పాషా, టీడీపీ నాయకులు నల్లమల రంజిత్ సిపిఐ
జిల్లా కార్యవర్గసభ్యులు శింగునర్సింహారావు, ఎస్.కె.జానిమియా, బి.జి.క్లెమెంట్, పోటు కళావతి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒకే కుటుంబంలోని నలుగురి దారుణ హత్య.. 16 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్

Drukpadam

పిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి…!

Drukpadam

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా…

Drukpadam

Leave a Comment